తూర్పు లద్దాక్ సరిహద్దుల్లో మోహరించిన తన సైన్యాన్ని చైనా పూర్తిగా ఉపసంహరించినప్పుడే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని భారత్ స్పష్టం చేసింది.
ఇరుదేశాల లెఫ్టినెంట్ జనరల్స్ సమావేశం తరువాత.. లద్దాక్ సహా మరో మూడు కీలక ప్రాంతాల నుంచి తమ తమ సైన్యాలను ఉపసంహరించుకోవాలని భారత్, చైనా నిర్ణయించాయి. అందులో భాగంగా ఇరుదేశాలు ఇవాళ్టి నుంచి సైన్యం ఉపసంహరణ ప్రక్రియను చేపట్టాయి. ఇప్పటికే గాల్వన్ లోయ, పీపీ-15, హాట్ స్ప్రింగ్స్‌లో 2 - 2.5 కి.మీ దూరం బలగాలను వెనక్కు మళ్లించాయి.
ఆ పది వేల సైన్యం సంగతేంటి?
మరోవైపు వాస్తవాధీన రేఖ వెంబడి చైనా 10,000 వేల మంది సైనికులు, యుద్ధ ట్యాంకులు మోహరించి ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. దీనితో భారత్ కూడా లద్దాక్ సెక్టార్లో భారీగా సైన్యాన్ని మోహరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.