తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ దంగల్​​: కపిల్​ మిశ్రాపై కేసు.. ట్వీట్​ తొలగింపు

దిల్లీ ఎన్నికలపై వివాదాస్పద ట్వీట్​ చేసిన భాజపా అభ్యర్థి కపిల్ మిశ్రాపై కేసు నమోదు చేశారు దిల్లీ పోలీసులు. ఎఫ్​ఐఆర్ నమోదు చేయాలన్న ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో... ఎన్నికల సంఘం ఆదేశాలతో కపిల్​ ట్వీట్​ను తొలగించింది ట్విట్టర్​. పోలింగ్ రోజు దిల్లీ వీధుల్లో భారత్​, పాకిస్థాన్​ పోటీ పడతాయని భాజపా నేత కపిల్​ మిశ్రా ట్వీట్​ చేశారు. కపిల్ చేసిన ట్విట్టర్ పోస్ట్ రాజకీయ దుమారం రేపింది.

By

Published : Jan 24, 2020, 9:50 PM IST

Updated : Feb 18, 2020, 7:20 AM IST

kapil misra
కపిల్ మిశ్రా

దిల్లీ శాసనసభ ఎన్నికలను ఉద్దేశించి ట్విట్టర్​లో వివాదాస్పద పోస్ట్ చేసిన భాజపా నేత కపిల్ మిశ్రాపై చర్యలకు ఉపక్రమించింది ఎన్నికల సంఘం. ఆయనపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు భాజపా నేతపై కేసు నమోదు చేశారు దిల్లీ పోలీసులు. అదే సమయంలో ఎన్నికల సంఘం ఆదేశాలతో కపిల్ పోస్ట్​ను తొలగించింది ట్విట్టర్. కపిల్​ ట్వీట్​పై వివరణ ఇవ్వాలని కోరుతూ అంతకుముందు షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఎన్నికల అధికారులు.

"వివాదాస్పద ట్విట్టర్​ పోస్ట్​ అంశమై కపిల్ మిశ్రాపై ఎఫ్​ఐఆర్ నమోదు చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోలీసులను ఆదేశించారు."

-దిల్లీ ముఖ్య ఎన్నికల నిర్వహణాధికారి

ఫిబ్రవరి 8న ది‌ల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఆ రోజున వీధుల్లో భారత్‌, పాకిస్థాన్‌ పోటీ పడతాయని ట్వీట్‌ చేశారు మిశ్రా. ఆయన చేసిన ట్విట్టర్ పోస్ట్ రాజకీయ దుమారం రేపింది.

ఇదీ చూడండి: దిల్లీ దంగల్​: భాజపా నేత వివాదాస్పద ట్వీట్​.. ఈసీ నోటీసులు

Last Updated : Feb 18, 2020, 7:20 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details