తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​-అమెరికా మధ్య కుదిరిన బెకా ఒప్పందం - జైశంకర్​

India and the U.S. will sign the last foundational agreement, Basic Exchange and Cooperation Agreement for Geo-Spatial Cooperation (BECA) during the 2+2 ministerial dialogue on Tuesday.

యూఎస్​ భారత్​
us india

By

Published : Oct 27, 2020, 11:37 AM IST

Updated : Oct 27, 2020, 2:46 PM IST

13:57 October 27

బెకా ఒప్పందంపై సంతకాలు..

భారత్‌, అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. భారత్, అమెరికా రక్షణ, విదేశాంగశాఖల మంత్రుల మధ్య జరుగుతున్న టూ ప్లస్ టూ సమావేశంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కీలకమైన బెకా ఒప్పందం.. కుదిరింది.  హైదరాబాద్ హౌస్‌లో జరిగిన సమావేశంలో అమెరికా విదేశాంగమంత్రి మైక్  పాంపియో, రక్షణ మంత్రి మార్క్  టీ ఎస్పర్‌లతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ , విదేశాంగ మంత్రి జైశంకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బేసిక్ ఎక్ఛేంజ్ అండ్ కోపరేషన్  అగ్రిమెంట్‌పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.

భారత్​ తరఫున రక్షణ శాఖ అదనపు కార్యదర్శి జివేశ్​ నందన్​ సంతకం చేశారు. 

గత 2 దశాబ్దాలుగా భారత్‌, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొవడం చాలా ముఖ్యమని, దీనికి భారత్‌, అమెరికా మధ్య సంబంధాలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు.

ఆనందం వ్యక్తం చేసిన రాజ్​నాథ్​..

'బెకా' ఒప్పందాన్ని పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. సమాచార మార్పిడికి ఇది సరికొత్త మార్గాలను తెరిచిందని వ్యాఖ్యానించారు. ఇతర సమస్యలపైనా అమెరికాతో చర్చించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని అన్నారు. రెండు ప్రజాస్వామ్య దేశాలు కలిసి అభివృద్ధి చెందే అవకాశం ఈ ఒప్పందం ద్వారా లభించిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి పాంపియో తెలిపారు. ప్రపంచంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు,  ప్రపంచ రక్షణ అంశాలపై చైనా ప్రభావం తదితర అంశాలపై ఇంకా చర్చించాల్సి ఉందన్నారు. గతంతో పోల్చుకుంటే గత ఏడాది కాలంలో రక్షణ, భద్రత రంగాల్లో ఇరు దేశాలూ మరింత బలపడ్డాయని అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ అన్నారు. ఇండో పసిఫిక్‌ రీజియన్‌లోని భద్రతాపరమైన సమస్యల పరిష్కారానికి ఈ ఒప్పందం మరింత దోహదపడుతుందని పేర్కొన్నారు.

అత్యాధునిక సైనిక సాంకేతికత, వసతి కేంద్రాలతోపాటు అంతరిక్ష సంబంధిత పటాలను పరస్పరం వినియోగించుకునేందుకు ‘బెకా’ ఒప్పందం వీలు కల్పిస్తుంది. తాజా ఒప్పందం ప్రకారం రక్షణ, భద్రతా రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత మెరుగుపర్చుకోవడం, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చల్లో భారత్‌, అమెరికా దృష్టి సారించినట్లు అర్థమవుతోంది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా ఉపగ్రహాలు, సెన్సర్లు సేకరించే సమాచారాన్ని, భౌగోళిక, అంతరిక్ష సమాచారాన్ని భారత్‌తో పంచుకునే అవకాశముంటుంది. తొలి చర్చలు 2018 సెప్టెంబరులో దిల్లీలో జరగ్గా.. రెండోసారి గత ఏడాది డిసెంబరులో వాషింగ్టన్‌లో జరిగాయి. తూర్పు సరిహద్దుల్లో డ్రాగన్‌ దేశం పదేపదే రెచ్చగొడుతున్న వేళ తాజా భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ప్రాంతీయ, అంతర్జాతీయ శక్తిగా భారత్‌ ఎదుగుతుండటాన్ని తాము స్వాగతిస్తున్నామని అమెరికా తెలిపింది. ఈ నేపథ్యంలో పొరుగు దేశం చైనా దుందుడుకుతనానికి చెక్‌పెట్టేందుకు అమెరికా, భారత్‌ కలిసి పని చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

11:31 October 27

హైదరాబాద్​ హౌస్​లో భారత్​, అమెరికా 2+2 చర్చలు

దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో భారత్ -అమెరికా రక్షణ శాఖల మధ్య కీలకమైన చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి మార్క్  టీ ఎస్పర్ లతో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశాంగ మంత్రి జైశంకర్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో  కీలకమైన రక్షణ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేసే అవకాశం ఉంది. ఇరు దేశాల సైనికుల మధ్య ఉన్నతస్థాయి, సైనిక సాంకేతిక పరిజ్ఞానం, లాజిస్టిక్స్,  జియో స్పేషియల్ మ్యాప్‌లను పంచుకునేందుకు  ఈ ఒప్పందం వీలు కల్పిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని మరింతగా పెంచడంతోపాటు...ఇరు దేశాల సైనిక సంబంధాలు మరింత బలపడే విధంగా ఇరు దేశాల రక్షణ మంత్రుల చర్చలు సాగుతున్నాయి.

ప్రాంతీయ భద్రతా సవాళ్లపై చర్చ సందర్భంగా తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఏర్పడిన వివాదం చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. అమెరికాకి చెందిన ఉపగ్రహాలు, సెన్సార్లు ప్రపంచవ్యాప్తంగా సేకరించే  కీలకమైన భౌగోళిక, అంతరిక్ష సమాచారాన్ని భారత్‌తో పంచుకొనేలా "బేసిక్  ఎక్స్ ఛేంజ్ అండ్  కోపరేషన్  అగ్రిమెంట్-బెకా' ఒప్పందాన్ని ఈ సమావేశంలో కుదుర్చుకోనున్నాయి. భారత్ బెకా ఒప్పందం కుదుర్చుకుంటే చైనా ఆక్రమణలను భారత్  సైనికులు గుర్తించి ఆయా ప్రదేశాలను రక్షించుకునేందుకు వీలుంటుంది.

Last Updated : Oct 27, 2020, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details