అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు పరస్పర అవగాహన ఒప్పందాల(ఎమ్ఓయూలు)పై సంతకం చేశారు. ఎమ్ఓయూలలో రెండు వైద్య రంగానికి సంబంధించినవి కాగా ఒకటి ఇంధన రంగానికి చెందినది. వీటితో పాటు ఇరుదేశాల మధ్య 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయి.
భారత్-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాలివే..
భారత్-అమెరికా మధ్య 3 బిలియన్ డాలర్లు విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయి. అలానే మూడు అవగాహన ఒప్పందాలపై ఇరువురు అగ్రనేతలు సంతకాలు చేశారు. ఒప్పందాల వివరాలను ఒకసారి చూద్దాం.
భారత-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాలివే..
ఒప్పందాల వివరాలు...
- రక్షణ ఒప్పందంలో భాగంగా 6 అపాచీ, 24 ఎంహెచ్-60 రోమియో హెలికాప్టర్లను భారత్కు అమెరికా అందజేయనుంది.
- ఇంధన రంగంలో సహకారానికి భారీ ఒప్పందం.
- రెండు దేశాల ఆరోగ్యశాఖల మధ్య మానసిన వైద్యానికి సంబంధించి అవగాహన ఒప్పందం.
- ఆరోగ్య ఉత్పత్తుల సంరక్షణపై కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ), అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ ఎఫ్డీఏ) మధ్య అవగాహన ఒప్పందం.
- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎక్సాన్ మోబిల్ ఇండియా ఎల్ఎన్జీ లిమిటెడ్, ఛార్ట్ ఇండస్ట్రీస్, అమెరికా మధ్య సహకారపత్రంపై సంతకం.
- ఇదీ చూడండి:దిల్లీ ప్రభుత్వ పాఠశాలకు మెలానియా ట్రంప్
Last Updated : Mar 2, 2020, 1:09 PM IST