తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధాని నరేంద్రమోదీ రక్షణకు అమెరికాతో భారీ ఒప్పందం ​

అగ్రరాజ్యం అమెరికాతో సంబంధాలు మరింత బలపేతమయ్యే దిశగా రూ.1200 కోట్లు విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది భారత్​. ఇందులో భాగంగా రాష్ట్రపతి, ప్రధానులకు సంబంధించిన రెండు బోయింగ్ వీవీఐపీ​ విమానాల్లో క్షిపణి దాడులను సైతం తట్టుకునేలా రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు సూట్లను కొనుగోలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

India, US sign Rs 1200 cr deal for missile protection suites for new VVIP planes
ప్రధాని నరేంద్రమోదీ రక్షణకు అమెరికాతో భారీ ఒప్పందం ​

By

Published : Mar 5, 2020, 6:20 PM IST

Updated : Mar 5, 2020, 8:22 PM IST

ప్రధాని నరేంద్రమోదీ రక్షణకు అమెరికాతో భారీ ఒప్పందం ​

భారత్ అమెరికాతో మరో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు సంబంధించిన రెండు బోయింగ్ వీవీఐపీ విమానాల్లో రక్షణ వ్యవస్థను మరింత పెంచేందుకు.. రూ.1200 కోట్ల విలువైన సూట్లను కొనుగోలు చేయనుంది. 'ఎయిర్​ఫోర్స్​ వన్'​ పేరుతో రూపొందించే బోయింగ్-777​ విమానాలు.. క్షిపణి దాడులను సైతం తట్టుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి. గతనెలలో అగ్రరాజ్య అధినేత రెండురోజుల భారత పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

ఈ విమానాల్లోని స్వీయ రక్షణ వ్యవస్థలో క్షిపణి హెచ్చరిక సెన్సార్లతో పాటు మరిన్ని అధునాతన రక్షణ సదుపాయాలున్నాయి.

సైన్యం, నౌకాదళ ఒప్పందాలు

అమెరికా అధ్యక్షుడు భారత పర్యటన సందర్భంగా.. నావికాదళానికి సంబంధించి 24 ఎంహెచ్-60 రోమియో మల్టీరోల్​ హెలికాప్టర్లు, సైన్యం కోసం 6 కొత్త అపాచీ అటాక్​ చాపర్లను భారత్​కు అందించేందుకు అగ్రరాజ్యం అంగీకరించింది.​

ఇదీ చదవండి:4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం

Last Updated : Mar 5, 2020, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details