తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బెకా ఒప్పందంతో చైనా ఆధిపత్యానికి చెక్​!

భారత్​-అమెరికా మధ్య ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బెకా ఒప్పందం కుదిరింది. తూర్పు లద్దాఖ్​లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ ఒప్పందం భారత్​కు కీలకంగా మారింది. ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో చైనా దుందుడుకు చర్యలకు దీని ద్వారా అడ్డుకట్ట వేయనున్నట్లు భారత్​-అమెరికా సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ప్రాంతీయ సమగ్రత, స్వేచ్ఛను కాపాడేందుకు సైనిక పరంగా పరస్పర సహకారం అందించుకోనున్నట్లు స్పష్టం చేశాయి.

india-us-issue-joint-statements-after-2-plus-2-ministerial-dialogue
బెకా ఒప్పందంతో చైనా ఆధిపత్యానికి చెక్​!

By

Published : Oct 27, 2020, 5:43 PM IST

Updated : Oct 27, 2020, 8:38 PM IST

భారత్​-అమెరికా సంబంధాలు మరో మైలురాయిని చేరుకున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసున్న బెకా(బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్​) ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. దిల్లీలో జరిగిన మూడవ 'టూ ప్లస్​ టూ' సమావేశాల్లో ఈ అధికారిక ప్రక్రియ పూర్తయింది. ఈ భేటీలో రెండు దేశాలకు చెందిన విదేశాంగ, రక్షణ శాఖల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

టూ ప్లస్​ టూ సమావేశంలో పాల్గొన్న ఇరు దేశాల మంత్రులు, అధికారులు

బెకా ఒప్పందంతో అత్యున్నత సైనిక సాంకేతికత, రహస్య​ శాటిలైట్ డేటా, ఇరుదేశాలకు చెందిన కీలక సమాచారాన్ని భారత్​-అమెరికా ఇచ్చిపుచ్చుకోనున్నాయి​. తూర్పు లద్దాఖ్​లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ ఒప్పందం భారత్​కు ఎంతో కీలకంగా మారింది. అంతేకాకుండా అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు మరింత మెరుగుపడతాయి.

రాజ్​నాథ్ స్పందన..

బెకా ఒప్పందంతో చైనా ఆధిపత్యానికి చెక్​!

అమెరికా, భారత్​ మధ్య పరస్పర సైనిక సహకారం ఎంతో పురోగతి సాధించిందని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ తెలిపారు. ఈ ఒప్పందంతో పొరుగు దేశం సహా ఇతర దేశాల్లో సంయుక్త కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం లభిస్తుందని చెప్పారు. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని సమర్థిస్తూ.. నిబంధనలను గౌరవిస్తూ అంతర్జాతీయ సముద్రంలో స్వేచ్ఛ నెలకొనేలా ముందుకు సాగాలని ఇరు దేశాల నిర్ణయించినట్లు రాజ్​నాథ్ వెల్లడించారు.

చైనా ఆటలు సాగనివ్వం..

రెండు దేశాల మధ్య భాగస్వామ్యం గతంలో కంటే ఇప్పుడే అత్యంత ముఖ్యమని అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ అన్నారు. కరోనా సంక్షోభం, భద్రతా సవాళ్లు పెరుగుతున్న వేళ ఇండో-పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం నెలకొల్పడం కీలకమన్నారు. ఇండో-పసిపిక్ ప్రాంతంలో దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న చైనాను నిలువరించి ఆ ప్రాంతంలో స్వేచ్ఛను కాపాడేందుకు భారత్​కు అవసరమైన అన్ని రకాల సహకారాలు అందిస్తామని ఎస్పర్ స్పష్టం చేశారు.

భారత్​కు అండగా ఉంటాం..

భారత ప్రజల స్వేచ్ఛ, సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే సహించబోమని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తేల్చి చెప్పారు. భారత్​కు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గల్వాన్​ లోయ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది భారత సైనికుల స్మారకానికి నివాళులు అర్పించిన అనంతరం వారి త్యాగాలను కొనియాడారు పాంపియో. చైనా కమ్యూనిస్టు పార్టీకి ప్రజాస్వామ్య విలువలు పట్టవని ధ్వజమెత్తారు.

నాలుగో కీలక ఒప్పందం

  • భారత్​-అమెరికా మధ్య 2002లో 'జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్​ అగ్రిమెంట్'(జీఎస్​ఓఎంఐఏ) కుదిరింది. భారత్​తో అమెరికా పంచుకున్న కీలకమైన సమాచారానికి భద్రత కల్పించేందకు అవసరమైన ప్రమాణాలను ఇది అందించింది.
  • 2016లో భారత్​ను కీలక రక్షణ భాగస్వామిగా ప్రకటించింది అమెరికా. అదే ఏడాది రెండు దేశాల మధ్య 'లాజిస్టిక్స్​ ఎక్స్చేంజ్​ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్' కుదిరింది.
  • 2018లో రెండు దేశాల మధ్య 'కమ్యూనికేషన్స్​ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్' కుదిరింది. దీని ద్వారా భారత్​-అమెరికా సైనికపరంగా పరస్పర సహకారం అందించుకునేందుకు అంగీకరించాయి. అమెరికా నుంచి అత్యాధునిక సాంకేతికతను భారత్​ కొనుగోలు చేసేందుకు మార్గం సుగమమైంది.
  • తాజాగా కుదిరిన బెకా ఒప్పందంతో అమెరికా నుంచి భౌగోళిక-ప్రాదేశిక సమాచారంతో పాటు, సైనికపరమైన కీలక సమాచారాన్ని భారత్​ పొందనుంది.
Last Updated : Oct 27, 2020, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details