తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టార్గెట్​ చైనా: 'ఇండో పసిఫిక్'​పై భారత్​- అమెరికా చర్చ - ఇండో-పెసిఫిక్

ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో చైనా ఆధిపత్యం పెరుగుతున్న తరుణంలో... ప్రత్యర్థి విసిరే సవాళ్లను కలిసిగట్టుగా ఎదుర్కోవాలని భారత్​-అమెరికా నిర్ణయించాయి. ఇరు దేశాల మధ్య మంగళవారం జరిగిన వర్చువల్​ సమావేశంలో అధికారులు ఇండో పసిఫిక్​ సహా అంతర్జాతీయ సమస్యలపై ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చలు జరిపారు.

India, US discuss bilateral cooperation, Indo-Pacific
టార్గెట్​ చైనా: ఇండో పెసిఫిక్​పై భారత్​- అమెరికా చర్చలు

By

Published : Jul 8, 2020, 1:35 PM IST

వివిధ అంతర్జాతీయ అంశాలపై భారత్​- అమెరికా మంగళవారం వర్చువల్​ విధానంలో సమావేశాన్ని నిర్వహించాయి. ఈ నేపథ్యంలో దైపాక్షిక సహకారంపై ఇరు దేశాలకు చెందిన అధికారులు చర్చించారు. స్వేచ్ఛ, శాంతి, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్​ ప్రాంతాన్ని స్థాపించేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నట్టు పునరుద్ఘాటించారు.

"అమెరికా రాజకీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డేవిడ్​ హేల్​, భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్​ వర్ధన్​ శ్రింగ్లా మంగళవారం సమావేశమయ్యారు. నియమాల ఆధారంగా నడిచే అంతర్జాతీయ వ్యవస్థ, ద్వైపాక్షిక, బహుళ విధానాల దౌత్య సహకారం, సముద్ర భద్రతకు వాటిల్లుతున్న ముప్పుపై చర్చించారు. కరోనా వైరస్​పై ప్రపంచ దేశాల తీరుపైనా సమాలోచనలు జరిపారు. ఇదే సమావేశంలో అంతర్జాతీయ సమస్యలపై పూర్తి స్థాయి ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన విషయాలను చర్చించారు. ఇరు దేశాలకు చెందిన నేతలు నిర్దేశించిన ప్రపంచస్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత దృఢపరచాలని నిర్ణయించారు."

--- అమెరికా రాజకీయ వ్యవహారాల శాఖ ప్రకటన

ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో చైనా తన సైనిక, ఆర్థిక శక్తిని పెంపొందించుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు విసిరే సవాళ్లను కలిసిగట్టుగా ఎదుర్కోవాలని, ఒకరి లక్ష్యాలకు మరొకరు మద్దతు పలకాలని ఇరు దేశాల ప్రతినిధులు తీర్మానించారు.

ABOUT THE AUTHOR

...view details