తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉగ్ర వ్యతిరేక సంస్థలు, ఐరాసకు మధ్య సహకారం ఉండాలి'

ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చే వారిపై పోరాడుతున్న సంస్థలతో ఐక్యరాజ్యసమితి సహకారం పెంపొందించుకోవాలని భారత్​ సూచించింది. ఉగ్రవాదంపై పోరాటానికి అంతర్జాతీయ సహకారం ఉండాలని ఐరాస సమావేశంలో భారత్​ స్పష్టం చేసింది. సైబర్ నేరాలను అరికట్టడానికి అధునాతన సమాచార మార్పిడి వ్యవస్థ ఉండాలని తెలిపింది.

By

Published : Oct 5, 2019, 6:26 PM IST

'ఉగ్ర వ్యతిరేక సంస్థలు, ఐరాసకు మధ్య సహకారం ఉండాలి'

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే నెట్​వర్క్​లపై ఉక్కుపాదం మోపడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ (ఎఫ్​ఏటీఎఫ్​) మధ్య మరింత సహకారం ఉండాలని భారత్​ స్పష్టం చేసింది. సామాజిక, మానవతా సంబంధాలు, మానవ హక్కులపై కార్యకలాపాలు సాగించే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం.. మూడో కమిటీలో భారత్​ తన గళాన్ని వినిపించింది. భారత్ తరఫున మాట్లాడిన పావ్​లోమి త్రిపాఠీ... అంతర్జాతీయ శాంతి, స్థిరమైన అభివృద్ధికి చేపట్టే చర్యలను.. ఉగ్రవాదులకు నిధులు అందజేసే సంస్థలు నీరుగారుస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై నొక్కి చెప్పారు త్రిపాఠీ.

"ఐఎస్​ఐఎల్, అల్ షబాబ్, బొకొ హరామ్ వంటి ఉగ్రవాద సంస్థలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మనుషుల అక్రమ రవాణా, సహజ వనరుల అక్రమ వెలికితీత, సాంస్కృతిక కళాఖండాల వ్యాపారం, తమ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో అక్రమ సుంకాలు వంటి క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారు. నార్కోటిక్స్ వంటి మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు సమకూర్చుకోవడానికే కాక యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. అక్రమ విధానాల ద్వారా సంపాదించిన డబ్బును సరిహద్దు దాటిస్తున్నారు."

--పావ్​లోమి త్రిపాఠీ, ఐరాసలో భారత్​ తరపు కార్యదర్శి

అధునాతన సమాచార వ్యవస్థ ఉండాలి

"వీటి ప్రభావం కేవలం ప్రభుత్వ పరిపాలనకే పరిమితం కాదు. హవాలా, అవినీతి, ఇతర ఆర్థిక నేరాల ద్వారా స్వదేశీ వనరులకు తీవ్రమైన హాని కలుగుతుంది. ఉగ్రవాదం, బహుళజాతి వ్యవస్థీకృత నేరాల కలయికతో ఈ సమస్యలు మరింత క్లిష్టతరమవుతున్నాయి. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే నెట్​వర్క్​లకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్​ ఫోర్స్ వంటి సంస్థలతో ఐక్యరాజ్యసమితి మరింత సహకారం పెంపొందించుకోవాలి. డ్రోన్లు, వర్చువల్ కరెన్సీ, రహస్య సంభాషణ, కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతలను ముష్కరులు ఉపయోగిస్తున్నారు. దీనిపై పోరాడటానికి ఎఫ్​ఏటీఎఫ్​ వంటి ఏజెన్సీలకు అధునాతన సమాచార వ్యవస్థ అవసరం ఉంది."

--పావ్​లోమి త్రిపాఠీ, ఐరాసలో భారత్​ తరపు కార్యదర్శి

అదుపులో డ్రగ్స్​....

క్రిమినల్ జస్టిస్, ఆరోగ్యం వంటి రంగాల్లో అంతర్జాతీయ సహకారం పెంచుకోవాలని త్రిపాఠీ సూచించారు. ప్రస్తుతం 35 మిలియన్ల మంది ప్రజలు డ్రగ్స్ వల్ల వచ్చే రోగాల బారిన పడ్డారని వెల్లడించారు. 11 కోట్ల మంది ప్రజలు డ్రగ్స్​ను శరీరంలోకి ఎక్కించుకుంటున్నారని, 14 లక్షల మంది హెచ్​ఐవీతో బాధ పడుతున్నట్లు చెప్పారు. 56 లక్షల మంది హెపటైటీస్-సీ వ్యాధికి గురైనట్లు తెలిపారు.

"అవసరమయ్యే మందులను అందుబాటులోనే ఉంచుతూ, డ్రగ్స్​ను దుర్వినియోగం చేయకుండా ఒక సమతుల్యమైన విధానం పాటించాలి. 'నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్​ డ్రగ్ డిమాండ్ రిడక్షన్' పేరిట 2023 నాటికి డ్రగ్​ డిమాండ్ తగ్గించేలా భారత్​ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అవగాహన పెంపొందించడం కౌన్సిలింగ్, చికిత్స అందించడం, పునరావాసం కల్పించడం వంటివి చేపడతారు."

--పావ్​లోమి త్రిపాఠీ, ఐరాసలో భారత్​ తరపు కార్యదర్శి

అంతర్జాలం, సామాజిక మాధ్యమాలు ఉపయోగించి డ్రగ్స్​కు బానిసలయ్యేలా ముష్కరులు ఉసిగొల్పుతున్నారని అన్నారు. అందువల్ల ప్రతీ ఒక్కరు సమాజం పట్ల దృఢమైన సంబంధాలు కలిగి ఉండాలని త్రిపాఠీ వెల్లడించారు.

సైబర్ నేరాలు

సాధారణ నేరాలతో పోలిస్తే సైబర్ నేరాలు చేసే తీరు వాటి పరిధి, ఆధారాలు వేరుగా ఉంటాయన్నారు త్రిపాఠీ. వాటిని అడ్డుకోవడానికి తక్షణం బదిలీ చేసుకోగలిగే సమాచార వ్యవస్థ ఉండాలన్నారు. సైబర్ నేరాల దర్యాప్తులో డిజిటల్ సాక్ష్యాలు సంపాదించడానికి అంతర్జాతీయంగా అన్ని వర్గాల మధ్య సహకారం మరింత పెరగాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: బిహార్​ వరదలు: 21 రోజులుగా చెట్లపైనే జీవనం!

ABOUT THE AUTHOR

...view details