తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పీఓకే పరిస్థితిపై పాక్​కు రాజ్​నాథ్​ హెచ్చరికలు - 'తీరు మార్చుకోకపోతే 1971 పునరావృతమవుతుంది'

పద్ధతి మార్చుకోకపోతే గతంలో జరిగిన పరిణామాలు పునరావృతం అవుతాయని పాక్​ను హెచ్చరించారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్. 1971లో పాకిస్థాన్​ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన పరిస్థితిని గుర్తు చేసుకోవాలని సూచించారు. ఆక్రమిత కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను గుర్తించకపోతే వారూ అదేబాట పడతారన్నారు.

'తీరు మార్చుకోకపోతే 1971 పునరావృతమవుతుంది'

By

Published : Sep 26, 2019, 6:27 AM IST

Updated : Oct 2, 2019, 1:18 AM IST

పాక్​కు రాజ్​నాథ్​ హెచ్చరికలు

రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్ పాకిస్థాన్​కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 1971లో పాకిస్థాన్​ నుంచి బంగ్లాదేశ్​​ విడిపోయిన నాటి పరిస్థితిని గుర్తుపెట్టుకోవాలన్నారు. తన వైఖరిని మార్చుకోకుంటే పాక్​ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు బంగ్లాదేశ్​ మాదిరిగానే తిరుగుబాటు చేస్తారని వ్యాఖ్యానించారు.

"1971లో పాకిస్థాన్ విడిపోయింది. బంగ్లాదేశ్ ఏర్పడింది. మీరు తప్పును పునరావృతం చేయకండి. అలా కాకపోతే ఆక్రమిత కశ్మీర్​లో ఏం జరగుతుందో చూడండి."

--- రాజ్​నాథ్ సింగ్, రక్షణమంత్రి.

ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతకర్త దీన్​దయాళ్​ ఉపాధ్యాయ్​ స్మారకార్థం రాజస్థాన్​లోని ధాన్​క్యా గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన రాజ్​నాథ్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

'ఇప్పుడు ఎలా ఉంటుందో...'

బాలాకోట్​ దాడుల్లో పాకిస్థాన్​కు, ఆ దేశ సైన్యానికి ఎలాంటి హానీ జరగకుండా భారత్​ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిందని.. కానీ ఇప్పుడు దాయాది దేశం తన తీరును మార్చుకోకపోతే.. పరిస్థితులు మారవచ్చని ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజ్​నాథ్​. భారత్​ను అస్థిరపరిచేందుకు పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పావుగా వాడుకుంటోందని ఆరోపించారు.

ఇదీ చూడండి: జులైలో భారీగా పెరిగిన ఉద్యోగాలు..!

Last Updated : Oct 2, 2019, 1:18 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details