తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వుహాన్​లోని మనోళ్లను రప్పించేందుకు కేంద్రం యత్నాలు - కరోనా

రాకాసి కరోనా వల్ల వుహాన్​ నగరంలో చిక్కుకుపోయిన 250 భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. బీజింగ్​లోని భారత రాయబారులు వుహాన్​ యంత్రాంగంతో కలిసి ఈ అంశంపై సంప్రదింపులు జరిపారు. భారతీయులను తక్షణమే అక్కడి నుంచి  తరలించేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది భారత రాయబార కార్యాలయం.

karona
కరోనా

By

Published : Jan 28, 2020, 12:07 AM IST

Updated : Feb 28, 2020, 5:32 AM IST

మహమ్మారి కరోనా వైరస్​ విజృంభిస్తోన్న నేపథ్యంలో భారత్​ అప్రమత్తమైంది. వైరస్​ కేంద్రబిందువు వుహాన్​లో ఉన్న దాదాపు 250 మంది భారతీయులను వెనక్కి రప్పించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కేబినెట్​ సెక్రటరీ రాజీవ్​ గాబా అధ్యక్షతన సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

చైనాతో చర్చలు...

వైరస్​ గడగడలాడిస్తున్న నేపథ్యంలో వుహాన్​ నగరంలో కార్యకలాపాలన్నీ మూసివేశారు అధికారులు. ఫలితంగా అక్కడ నివసించే వారు ఇతర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వుహాన్, హుబెయ్​​లో ఉన్న 250 మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు. ప్రస్తుతం వారందరినీ భారత్‌కు తీసుకువచ్చేలా చైనాతో చర్చలు జరుపుతోంది భారత ప్రభుత్వం. ఈ మేరకు బీజింగ్​లోని భారత్​ రాయబారులు అక్కడి యంత్రాంగంతో చర్చలు జరిపారు. అనంతరం భారతీయులను తరలించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

కేరళవారే అధికం

ఇప్పటి వరకు చైనా నుంచి భారత్​కు వచ్చిన 155 విమానాల్లోని 33వేల 552 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్​ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వైద్యపరిశీనలలో 450 మంది ఉన్నారు. ఇందులో అధిక శాతం కేరళకు చెందిన వారే. అయితే ఇప్పటివరకు వీరిరి కరోనా వైరస్​ సోకినట్లు ఒక్క కేసు కూడా నిర్ధరించలేదు.

ముంబయిలో అనుమానం

జనవరి 18నుంచి ముంబయి అంతర్జాతీయ విమానాశ్రమానికి చైనా నుంచి 3756 ప్రయాణికులు చేరుకున్నారు. వీరిలో ఐదుగురికి దగ్గు, జ్వరం వంటి లక్షణాలను గుర్తించి.. వారిలో ఇద్దరికి వైరస్​ సోకినట్టు అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి : కరోనా కలకలం: వుహాన్​లో మనోళ్లు సురక్షితమేనా?

Last Updated : Feb 28, 2020, 5:32 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details