తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'2030 కల్లా 50 లక్షల హెక్టార్ల భూమికి పునరుజ్జీవం'

2030 కల్లా సుమారు 50 లక్షల హెక్టార్ల భూమిని సారవంతంగా పునరుద్ధరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించింది. ఎడారీకరణ సమస్యపై సెప్టెంబర్​ 2 నుంచి 13 వరకు నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యమివ్వనుంది భారత్​.

'2030 కల్లా 50 లక్షల హెక్టార్ల భూమికి పునరుజ్జీవం'

By

Published : Aug 28, 2019, 5:07 AM IST

Updated : Sep 28, 2019, 1:29 PM IST

'2030 కల్లా 50 లక్షల హెక్టార్ల భూమికి పునరుజ్జీవం'
పర్యావరణ కారణాలతో దేశంలో సారం కోల్పోతున్న భూములను పునరుద్ధరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. భారత్​లోని సుమారు 50 లక్షల హెక్టార్లు సారం కోల్పోయిన భూమి(డీగ్రేడెడ్​ ల్యాండ్​)కి 2030 కల్లా పునరుజ్జీవం తీసుకొస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ తెలిపారు. ఈ మేరకు కేంద్రం ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టామన్నారు.

సీఓపీ సదస్సు...

ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణ సమస్యను ఎదుర్కొనేందుకు యూఎన్​సీసీడీలోని 'కాన్ఫరెన్స్​ ఆఫ్​ పార్టీస్-14​ (సీఓపీ-14)' ఈ ఏడాది భేటీ కానుంది. సెప్టెంబర్​ 2-13 మధ్య జరిగే ఈ సదస్సుకు భారత్​ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో దిల్లీలోని జాతీయ మీడియా కేంద్రంలో జరిగిన ముందస్తు సమావేశంలో పలు అంశాలు వెల్లడించారు కేంద్ర మంత్రి​.

ఈ సదస్సుకు సుమారు 200 దేశాలకు చెందిన 3వేల మంది ప్రతినిధులు, 100 మంది మంత్రులు హాజరవుతున్నారని చెప్పారు జావడేకర్​. సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై కీలక అంశాలపై ప్రసంగిస్తారని తెలిపారు.

"ప్రపంచంలోని 3వ వంతు భూములు సారం కోల్పోయాయి. అది 40 వేల లక్షల హెక్టార్లుగా ఉంది. భారత్​లో​ 29 శాతం భూమి సారం కోల్పోయింది. ఇది మన ముందున్న పెద్ద సమస్య. దానిని సారవంతంగా మార్చుతాం. అడవులను నరకటం, భూగర్భ జలాలను విపరీతంగా తోడేయటం, వరదలు వంటి పలు కారణాలతో భూములు పూర్తిగా నాశనమవుతున్నాయి. ఈ భూములను పునరుద్ధరించేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. "

- ప్రకాశ్​ జావడేకర్​, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి.

ప్రత్యేక కేంద్రం...

ఎడారీకరణ సమస్యను ఎదుర్కొనేందుకు దెహ్రాదూన్​​లోని అటవీ పరిశోధన విద్యాసంస్థలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు జావడేకర్​. భూసార క్షీణత సమస్యపై పరిశోధనలు చేసి దానికి పరిష్కార మార్గం చూపనుందన్నారు.

వచ్చే రెండేళ్లలో ఎడారీకరణను ఎదుర్కొనేందుకు చేపట్టే కార్యక్రమాల్లో భారత్​ ప్రధాన పాత్ర పోషించనుందని తెలిపారు కేంద్ర మంత్రి. చైనా నుంచి సీఓపీ అధ్యక్షత బాధ్యతలను భారత్​ తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రధాన పాత్ర పోషించనుందన్నారు. దీనికి ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఇదీ చూడండి: కశ్మీర్ పర్యటక రంగం అభివృద్ధికి కేంద్రం చర్యలు

Last Updated : Sep 28, 2019, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details