తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మేడిన్​ ఇండియా స్పుత్నిక్​ టీకాపై ట్రయల్స్ - vaccine latest news

భార‌త్‌లో ఉత్పత్తి అవుతున్న స్పుత్నిక్-వి కొవిడ్ టీకాల‌పై.. రష్యా ప్రయోగాలు జరుపుతోంది. భారత్​లోని ఆ దేశ రాయబార కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. వచ్చే ఏడాది సుమారు 30 కోట్ల డోసులను భారత్​లో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేసింది.

India to produce 300 million doses of Sputnik V vaccine
భారత్​లో తయారైన స్పుత్నిక్​ టీకాపై ప్రయోగాలు

By

Published : Dec 18, 2020, 1:18 PM IST

భారత్​లో తాము తయారు చేసిన స్పుత్నిక్-వి టీకాపై తొలిసారి ట్రయల్స్​ నిర్వహిస్తున్నట్లు రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి(ఆర్​డీఎఫ్​) సీఈఓ దిమిత్రేవ్​ తెలిపారు. 2021లో సుమారు 300 మిలియన్ల స్పుత్నిక్​ డోసులను ఉత్పత్తి చేయనున్నట్లు భారత్​లోని రష్యా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ప్రపంచంలోనే తొలుత అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్​-వి టీకా.. 95 శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ ప్రకటించారు.

ఇదీ చూడండి: మా టీకా 95 శాతం సమర్థవంతం: పుతిన్

తుది దశలో ప్రయోగాలు..

స్పుత్నిక్​ వ్యాక్సిన్​ క్యాండిడేట్​ మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ కోల్​కతాలో జరగనున్నాయి. ఈ మేరకు పీర్​లెస్ ఆసుపత్రి ఎథిక్స్​ కమిటీ స్పష్టం చేసింది. సుమారు 100 మంది ఆరోగ్యవంతులపై టీకాను ప్రయోగించనున్నట్లు పేర్కొంది. డా.రెడ్డీస్​ లాబొరేటరీస్​, క్లినిమెడ్​ లైఫ్​సైన్సెస్​ సహకారంతో​ డా.సుభ్రోజ్యోతి ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

డా.రెడ్డీస్​ లాబొరేటరీస్​కు భారత్​లో ఈ ప్రయోగాలు నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చింది డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ).

ABOUT THE AUTHOR

...view details