తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో ఎస్​సీఓ ప్రభుత్వాధినేతల వార్షిక సదస్సు - జాతీయ వార్తలు తెలుగు

షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల ప్రభుత్వాధినేతల వార్షిక సమావేశానికి భారత్​ మొదటిసారి వేదిక కానుంది. ఈ ఏడాది జరిగే సదస్సుకు భారత్​ ఆతిథ్యం ఇస్తుందని ఎస్​సీఓ ప్రధాన కార్యదర్శి వ్లాదిమిర్ నొరోవ్ ప్రకటించారు.

INDIA-SCO
INDIA-SCO

By

Published : Jan 14, 2020, 5:10 AM IST

ఈ ఏడాది జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్​సీఓ) సభ్య దేశాల ప్రభుత్వాధినేతల మండలి వార్షిక సమావేశానికి భారత్​ మొదటిసారి ఆతిథ్యం ఇవ్వనుంది. దిల్లీలో 4 రోజుల పర్యటనలో ఉన్న ఎస్​సీఓ ప్రధాన కార్యదర్శి వ్లాదిమిర్​ నొరోవ్​.. విదేశాంగ మంత్రి జైశంకర్​తో భేటీ తర్వాత ఈ ప్రకటన చేశారు.

పాక్​ నుంచి వచ్చేదెవరు?

సాధారణంగా ప్రభుత్వాధినేతల మండలి సమావేశానికి చాలా దేశాలు విదేశాంగ మంత్రులనే పంపుతాయి. భారత్​ తరఫున విదేశాంగ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. కొన్ని దేశాలనుంచి వారి ప్రధానులు హాజరవుతారు.

ఎస్​సీఓలో పాకిస్థాన్​ కూడా సభ్య దేశంగా ఉంది. భారత్​లో జరిగే సమావేశానికి పాక్​ నుంచి ఎవరు హాజరవుతారనే విషయం ఆసక్తిగా మారనుంది.

సభ్య దేశాల సంతోషం

ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వటం పట్ల ఎస్​సీఓ సభ్య దేశాలు సంతోషం వ్యక్తం చేశాయని నొరోవ్​ తెలిపారు. యూరేసియా ప్రాంతంలో భారత్​ కీలకమైన దేశమని ఆయన పేర్కొన్నారు.

చైనా ఆధిపత్యం ఉండే ఎస్​సీఓలో 2005లో పరిశీలక దేశంగా చేరిన భారత్​.. 2017లో సభ్య దేశంగా మారింది. ఎస్​సీఓతో భద్రత పరమైన అంశాలతో పాటు ప్రాంతీయ ఉగ్రవాద నిరోధక విభాగం (ఆర్​ఓటీఎస్​)తో కీలకంగా వ్యవహరిస్తోంది.

8 వింతల్లో ఐక్యతా విగ్రహానికి చోటు

ఎస్​సీఓ సభ్య దేశాల్లోని 8 వింతల జాబితాలో భారత్​లోని ఐక్యతా విగ్రహానికి చోటు కల్పించింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా తెలిపిన జైశంకర్​.. ఎస్​సీఓ చర్యను అభినందించారు.

ఇదీ చూడండి : 40వేల కిమీ.. 1500 అమర జవాన్ల కుటుంబాలు.. ఓ బాలుడు

ABOUT THE AUTHOR

...view details