భారత్, చైనాల మధ్య తూర్పు లద్దాఖ్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభన ఇరు దేశాలూ భారీ స్థాయిలో సైన్యాలను, ఆయుధ వ్యవస్థలను మోహరించుకునే వరకూ వెళ్లింది. ప్రస్తుతానికి నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితులు రానున్న రోజుల్లో మరింత ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. సంక్లిష్టమైన వాతావరణం కలిగి ఉండే మంచు పర్వతాల్లో ప్రపంచంలోనే అతి పెద్ద దేశాల్లో రెండైన భారత్, చైనా ఇదివరకు ఎన్నడూ లేనంత భీకరంగా ముఖాముఖి తలపడేందుకు సిద్ధమవుతున్నన్నాయి. సరిహద్దుల విషయంలో తమ తమ వైఖరులపై అవి గట్టిగా నిలబడటం.. రానున్న శీతాకాలంలో అత్యంత తీవ్రమైన చలిని సైతం ఎదుర్కొనేందుకు వెనుకాడబోవన్న సంకేతాలనిస్తోంది. దీనిలో భాగంగానే అత్యంత ఎత్తైన శీతల ప్రాంతాల్లో శత్రువులను గట్టిగా తిప్పికొట్టేందుకు అవసరమైన ఆయుధాలను, పరికరాలను సమకూర్చుకొనే యత్నాల్లో భారత్ సైన్యం నిమగ్నమైంది.
"ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, సెన్సర్లుపరంగా ఉన్న నిర్వహణపరమైన లోపాలను గుర్తించాం. సైనిక ఉన్నతాధికారుల పర్యవేక్షణలో అత్యవసరమైన సైనిక సంపత్తి సేకరణను ముమ్మరం చేశాం. భారీ స్థాయిలో వాటిని కొనుగోలు చేయబోతున్నాం." అని ఓ సైనికాధికారి 'ఈటీవీ భారత్‌కు తెలిపారు'. 'ఆయుధాల కొనుగోలుకు సంబంధించి గతంలో ఏడాదికి 12 నుంచి 15 ఒప్పందాలు మాత్రమే జరిగేవి. చైనాతో సరిహద్దు ఘర్షణలు ప్రారంభమయ్యాక వాటి సంఖ్య 100 దాటింది. అది కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమల్లోకి వస్తాయని వివరించారు. రష్యాలో జరిగే ఆయుధ ప్రదర్శనను సందర్శించటానికి రక్షణ శాఖ కార్యదర్శి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ జరిగే భేటీల్లో చాలా కాలంగా చర్ఛల్లో నానుతున్న ఏకే-203 రైఫిళ్ల సంయుక్త తయారీ సహా పలు ఒప్పందాలు ఖరారు కావచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భవిషత్తు యుద్ధాలు చాలా సంక్లిష్టంగా, అత్యంత తీవ్రంగా, అనూహ్యంగా ఉంటాయి కనుక తగిన సన్నద్ధతలు అవసమని భారత సాయుధ దళాల సంయుక్త వ్యూహ పత్రం 2017 పేర్కొంది.
జాతీయతా వాదం...
చైనా భారత్‌లోనూ దృఢమైన నాయకత్వాలు అధికారంలో ఉండటంతో పాటు జాతీయవాదం ప్రబలమైన అంశంగా మారిపోయింది. నేటి ప్రపంచంలో అగ్రదేశాల సరసన స్థానం దక్కించుకోవాలని భారత్ కోరుకుంటోంది. 2049 నాటికి అత్యంతత శక్తివంతమైన దేశం అమెరికాను సైతం మించిపోయి ప్రపంచాధిపత్యం వహించాలన్న వ్యూహంతో చైనా ఉంది. తన లక్ష్య సాధనకు అవరోధంగా నిలిచే సవాళ్లన్నిటినీ అధిగమించేందుకు డ్రాగన్ ఉద్యుక్తమవుతోంది.
కరోనా కల్లోలంలో అమెరికా..
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవటంలో చైనా, భారత్‌లు రెండూ తమ బలహీనతలను బహిర్గతం చేసుకున్నాయి. అత్యధిక మరణాలు సంభివించిన దేశంగా అమెరికా నిలిచింది. అయితే తూర్పు లద్దాఖ్ వివాదం.. ప్రజల దృష్టిని కరోనా నుంచి మళ్లించేలా చేయటానికి ఆయా దేశాలకు ఉపయోగపడి ఉండవచ్చు. కరోనా విజృంభణతో పాటు జాతి వివక్ష వివాదం అమెరికాను చుట్టుముట్టి మరింత బలహీనపరిచిన పరిస్థితులు చైనాకు అనుకూలించేవే. ఇదే సమయంలో భారత్‌ను అడ్డుపెట్టుకొని చైనాను దెబ్బతీయాలని అమెరికా ఎదురుచూస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్‌లు చతుర్భుజ కూటమిగా పూర్తి స్థాయిలో అవిర్భవించటానికి ముందే దానిని దెబ్బ తీయాలని చైనా భావిస్తోంది. సరిహద్దు వివాదంపై ఎట్టిపరిస్థితుల్లోనూ దూకుడుగానే వెళ్లాలని డ్రాగన్ నిర్ణయించుకున్నట్లే.. భారత్ కూడా ఏ మాత్రం వెనక్కు తగ్గరాదన్న దృఢ నిశ్చయంతో ఉంది. ఈ పరిస్థితుల్లో శాంతి పవనాలకు అవకాశాలు తగ్గిపోతున్నాయి.
యంత్రాంగాల వైఫల్యం...
వివాదాలను సామరస్యంగా పరిష్కరరించుకొనేందుకు భారత్, చైనాలు పలు యంత్రాంగాలను ఇది వరకే ఏర్పాటు చేసుకున్నాయి. ఆయా సమస్యల తీవ్రతను బట్టి సైనిక, దౌత్య, ప్రత్యేక ప్రతినిధుల జాతీయ భద్రత (సలహదారుల) స్థాయిల్లో చర్చలు జరుగుతాయి. ఇవికాక ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగే అనధికార భేటీలూ ఉండనే ఉన్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ- జిన్‌పింగ్‌ల సమావేశ మినహా మిగతావన్నీ జరిగాయి. అయినా అవేమీ వివాదాన్ని పరిష్కరించలేకపోయాయి.
సరిహద్దు వివాదం.. పరిష్కారంపై భారత్, చైనా అంగీకారం
తూర్పు లద్దాఖ్‌లో చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలన్న అంగీకారానికి రెండు దేశాలూ వచ్చాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం వెల్లడించారు. రెండు దేశాల ప్రతినిధులు అంతకుముందు దృశ్యమాధ్యమ విధానం ద్వారా సమావేశమై వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట ఉన్న ప్రస్తుత పరిస్థితిపై చర్చించారని, పరస్పరం అభిప్రాయాలను తెలియజేసుకున్నారని చెప్పారు. పశ్చిమ ప్రాంతంలో సైనికులు ఉపసంహరణను చిత్తశుద్ధితో, పూర్తి స్థాయిలో అమలు చేయటానికి కట్టుబడి ఉందామన్న అవగాహనకు వచ్చారని చెప్పారు. సరిహద్దు వ్యవహారాలపై ఏర్పాటైన సంప్రదింపులు, సమన్వయ కార్యాచరణ యంత్రాంగం (డబ్ల్యూఎంసీసీ) నియమ నిబంధనలకు లోబడి గురువారం చర్చలు జరిగాయి. తూర్పు లద్ధాఖ్‌లో మే 5వ తేదీకి ముందున్న పరిస్థితులను పునరుద్ధరించేలా చైనా సైనికులు వెనక్కుమళ్లాలని భారత ప్రతినిధులు గట్టిగా కోరినట్లు తెలిసింది.
-(సంజీవ్ బారువా)