కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన వందేభారత్ మిషన్ను మరిన్ని దేశాలకు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అందులో కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, రష్యా, జర్మనీ, స్పెయిన్, థాయిలాండ్ వంటి దేశాలు ఉన్నట్లు చెప్పారు.
మధ్య ఆసియా సహా ఐరోపా దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు రెండో దశ వందే భారత్ మిషన్ను ఈనెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.