తెలంగాణ

telangana

భారత్​లో 28 మందికి కరోనా: కేంద్ర మంత్రి

By

Published : Mar 4, 2020, 10:42 AM IST

Updated : Mar 4, 2020, 1:11 PM IST

Amid a spike in the number of coronavirus cases in the country, the govt has asked the states to identify sites for quarantine facilities and isolation wards. In a meeting held by Cabinet Secretary Rajiv Gauba with Secretaries of Ministries concerned, and state Chief Secretaries and Health Secretaries, the decision to review and assess action taken for containment of COVID-19 was taken.

CORONA
భారత్​లో కరోనా.. అధికారుల అప్రమత్తం

13:08 March 04

28 పాసిటివ్​ కేసులు

దేశంలో ఇప్పటి వరకు 28 మందికి కరోనా వైరస్‌ ఉన్నట్టు గుర్తించామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ఇటలీ నుంచి వచ్చిన పర్యాటకులను ఐటీబీపీ క్యాంప్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నామని వివరించారు. దిల్లీలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబానికి కరోనా సోకినట్లు గుర్తించామన్నారు. ఆగ్రాలో నివసిస్తున్న ఆరుగురికి కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్ధరణ అయిందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకూ 28 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు సమాచారం అందిందని, అనుమానితుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.  తెలంగాణలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి 88 మందిని కలిసినట్లు తేలిందన్నారు.

12:47 March 04

భారత్​లో 28 మందికి కరోనా సోకినట్లు స్పష్టం చేశారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​. 14 మంది ఇటలీ దేశీయులకు వైరస్​ లక్షణాలు కనిపించాయని తెలిపారు. వీరిని ప్రస్తుతం ఐటీబీపీ చావ్లా నిర్బంధ కేంద్రంలో ఉంచినట్లు పేర్కొన్నారు. 

12:38 March 04

కరోనాపై అధికారులు అప్రమత్తం

భారత్​లో కరోనా ప్రభావం నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​.

  • కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఉండే ప్రదేశాలను శుభ్రం చేయించాం: హర్షవర్దన్‌
  • కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రదేశాలకు 3 కి.మీ. వరకు శుభ్రత చర్యలు చేపట్టాం: హర్షవర్దన్‌
  • అన్ని దేశాల నుంచే వచ్చే విదేశీయులను స్క్రీనింగ్ చేస్తున్నాం: హర్షవర్దన్‌
  • ఇరాన్‌లో కూడా ఒక ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం
  • ఇరాన్‌ నుంచి వచ్చే ప్రయాణికులను అక్కడే పరీక్షించి తీసుకువస్తే బావుంటుందని భావిస్తున్నాం
  • విదేశీయులు వెనక్కి వెళ్లాలన్నా వారి దేశాలు రానివ్వడం లేదు
  • అలాంటి వారిని ప్రత్యేక క్యాంపుల్లో ఉంచుతున్నాం
  • ఇటలీ గ్రూపులో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది‌
  • ఇటలీ పర్యాటకులు అందరినీ ఐటీబీపీ క్యాంపునకు పంపాం‌
  • తెలంగాణలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి 88 మందిని కలిసినట్లు తేలింది

12:13 March 04

ఉన్నతాధికారులతో ఆరోగ్య మంత్రి​ సమావేశం..

  • ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ సమావేశం
  • కరోనా వైరస్‌ కట్టడి చర్యలు, సన్నద్ధతపై చర్చ

10:43 March 04

బిహార్​లోనూ కరోనా..?

బిహార్​ ముజఫర్​పుర్​లోనూ కరోనా కేసు నమోదైందన్న సమాచారం చర్చకు దారితీసింది. థాయిలాండ్ నుంచి వెనక్కి వచ్చిన ఓ యువతికి కరోనా లక్షణాలు ఉన్నాయని సమాచారం చక్కర్లు కొట్టింది. అప్రమత్తమైన అధికారులు.. వైద్య పరీక్షలకు పంపించారు. 

10:07 March 04

భారత్​లో 28 మందికి కరోనా: కేంద్ర మంత్రి

భారత్​లో పలువురికి కరోనా సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక ఆసుపత్రులు సిద్ధపరుస్తున్నారు. భయపడాల్సిందేమీ లేదని ప్రజలకు సూచిస్తున్నారు.

ఝార్ఖండ్ లోని నీర్సా వద్ద ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడి నమూనాలను సేకరించేందుకు బయల్దేరారు అధికారులు. అతడి నమూనాలు సేకరించి ఎన్​ఐసీడికి పంపిస్తారని సమాచారం. వైద్య పరీక్షల ఫలితాల అనంతరమే కరోనా అంశమై నిర్ధరణకు రానున్నారు అధికారులు.  

ఒడిశా తీరానికి వచ్చిన ఓడలోని వ్యక్తికి కరోనా సోకిందని అనుమానం వ్యక్తం చేశారు అధికారులు. అతడిని కటక్​ లోని ఆసుపత్రికి తరలించారు. అతడు జ్వరం, గొంతు ఇన్​ఫెక్షన్​తో బాధపడుతున్నట్లు సమాచారం.

Last Updated : Mar 4, 2020, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details