దేశీయంగా అభివృద్ధి చేసిన 'హైపర్‌సోనిక్ సాంకేతిక క్షిపణి వాహక నౌక' (హెచ్ఎస్టీడీవీ)ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. భవిష్యత్తులో సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థలకు ఇది ఆసరాగా నిలిచి, వైమానిక అవసరాలను తీర్చగలదని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ హైపర్‌సోనిక్ సాంకేతికతను భారత రక్షణ పరిశోధన సంస్థ- డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. ఒడిశా వీలర్ ఐలాండ్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంచ్ కాంప్లెక్స్ నుంచి ఈ వాహక నౌకను ప్రయోగించింది.
రాజ్‌నాథ్ అభినందనలు..
ఈ ప్రయోగం విజయవంతం అవడం వల్ల దేశం సాంకేతిక రంగంలో కీలక ముందడుగు వేసినట్లైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇందుకు కృషిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
"గొప్ప విజయాన్ని సాధించిన డీఆర్డీఓకు శుభాకాంక్షలు. ప్రధాని మోదీ కల- ఆత్మనిర్భర్ భారత్ వాస్తవ రూపం దాల్చడానికి ఇది కీలక పరిణామం. డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోంది."