జమ్ము కశ్మీర్‌కు మ్యాప్‌ను తప్పుగా చూపించినందుకు వికీపీడియాకు కేంద్రం నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. వెబ్‌సైట్‌లోని తప్పుడు మ్యాప్‌కు చెందిన లింక్‌ను తొలగించాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
కశ్మీర్ మ్యాప్‌పై వికీపీడియాకు కేంద్రం నోటీసులు
జమ్ముకశ్మీర్ మ్యాప్‌ను తప్పుగా చూపించిన వికీపీడియాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన లింక్‌ను తొలగించాలని ఆదేశించింది. నవంబర్ 27న ఈ నోటీసులు పంపించినట్లు అధికారులు చెప్పారు. అయితే ఈ మ్యాప్‌ను వికీపీడియా సరిచేయలేదు.
ఓ ట్విట్టర్ వినియోగదారులు చేసిన ట్వీట్ ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నవంబర్ 27న నోటీసు పంపించినట్లు చెప్పారు. భారతదేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఉన్న ఈ పేజీని వెబ్సైట్ నుంచి తొలగించాలని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఈ ఆదేశాలను వికీపీడియా పాటించకపోతే.. చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉందని అన్నారు.
ఇప్పటివరకైతే వికీపీడియా ఈ మ్యాప్‌ను సరిచేయలేదు.
TAGGED:
Wikipedia jk wrong map