తెలంగాణ

telangana

ETV Bharat / bharat

2022 కల్లా భారత అమ్ములపొదిలో తేజస్​ 2.0 - సామర్థ్యం

స్వదేశీ పరిజ్ఞానంతో భారత్​ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్​ మరింత శక్తిసామర్థ్యాలు కలబోసుకొని తేజస్​ మార్క్-2గా రూపాంతరం చెందబోతోంది. భారత 75వ స్వాతంత్ర్య వేడుకల నాటికి ఇది సైన్యం అమ్ములపొదిలో చేరబోతోంది. ఫలితంగా దేశీయ ఆయుధ తయారీ సామర్థ్యం మరింతగా ఇనుమడించనుంది.

2022 కల్లా భారత అమ్ములపొదిలో తేజస్​ 2.0!

By

Published : Sep 19, 2019, 5:02 AM IST

Updated : Oct 1, 2019, 3:52 AM IST

2022 కల్లా భారత అమ్ములపొదిలో తేజస్​ 2.0

స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ అభివృద్ధి చేసిన తేలకపాటి యుద్ధవిమానం 'తేజస్'​ కొత్త అవతారంలో రాబోతోంది. రెట్టించిన శక్తిసామర్థ్యాలతో 'తేజస్ మార్క్​- 2' పేరుతో భారత 75వ స్వాతంత్ర్య వేడుకల నాటికి సిద్ధం కాబోతోంది. దీనితో దేశీయ ఆయుధ తయారీ సామర్థ్యం మరింత ఇనుమడించనుంది.

మార్​-2 రూపకల్పన

తేజస్​ మార్క్​-2కు ఏరోనాటికల్​ డెవలప్​మెంట్​ ఏజెన్సీ (ఏడీఏ) రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టుకు 2009లో ఆమోదం లభించింది. దీనిని హిందూస్థాన్ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​ (హెచ్​ఏఎల్​) ఉత్పత్తి చేస్తోంది. వీటి ఉత్పత్తి 2025-26 సంవత్సరంలో ప్రారంభమవుతుంది.

ఎఫ్​-16 కన్నా..

ఈ తేజస్​ పోరాట విమానం అమెరికాకు చెందిన ఎఫ్​-16 కంటే శక్తిమంతమైంది. గగనతలంలో శత్రువుతో తలపడడంలో దీనికి తిరుగులేదు. తేజస్​ మొదటి వెర్షన్ అన్ని పరీక్షలు పూర్తిచేసుకుని ఇప్పటికే భారత వైమానిక దళంలో చేరింది.

మార్క్​ -2 శక్తి సామర్థ్యాలు

  • మిరాజ్, జాగ్వార్ యుద్ధవిమానాల స్థాయి బరువుతో పాటు మరింత శక్తిమంతమైన జీఈ-414 ఇంజిన్​ దీని సొంతం.
  • సుదూరం నుంచి శత్రువుపైకి అస్త్రాలు ప్రయోగించే సామర్థ్యం.
  • అధునాతన ఏఈఎస్ఏ రాడార్​
  • గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేందుకు స్వదేశీ తయారీ 'అస్త్ర' క్షిపణి (దాదాపు 100 కి.మీ పరిధి)
  • స్వదేశీ 'యాంటీ రేడియేషన్​ క్షిపణి' (100 కి.మీ)
  • భూతల లక్ష్యాల ఛేదనకు 'స్మార్ట్ యూంటీ ఎయిర్​ ఫీల్డ్​ వెపన్' (సా)
  • శత్రు యుద్ధవిమానాల గమనాన్ని ముందే గుర్తించడానికి 'ఇన్​ఫ్రారెడ్​ సెర్చ్​ అండ్​ ట్రాక్' (ఐఆర్​ఎస్​టీ) సెన్సర్
  • దూసుకొస్తున్న క్షిపణులను గుర్తించి, అప్రమత్తం చేయడానికి 'మిసైల్ అప్రోచ్​ వార్నింగ్​ సిస్టమ్​' (ఎంఏడబ్ల్యూ ఎస్​)​
  • మెరుగైన కాక్​పిట్​
  • తేజస్​ మార్క్​-1 తేజస్​ మార్క్​-2
    పొడవు 13.2 మీటర్లు 14.7 మీటర్లు
    ఎత్తు 4.4 మీటర్లు 4.86 మీటర్లు
    రెక్కల విస్తీర్ణం 8.2 మీటర్లు 8.5 మీటర్లు
    ఆయుధాల అరలు 8 11
    ఇంజిన్ ఎఫ్​ 404 ఎఫ్​ 414
    గరిష్ఠ శక్తి 84 కేఎన్​ 98 కేఎన్​
    మోసే ఆయుధాల బరువు 3.8 టన్నులు 6.5 టన్నులు
    గరిష్ఠ వేగం 1.6 మ్యాక్​ 1.8 మ్యాక్​
    గరిష్ఠ బరువు 13,500 కిలోలు 17,500 కిలోలు
    పరిధి 1750 కిలోమీటర్లు 3500 కిలోమీటర్లు

    ఇదీ చూడండి:'హిందీ వివాదం'పై అమిత్​ షా వివరణ

Last Updated : Oct 1, 2019, 3:52 AM IST

ABOUT THE AUTHOR

...view details