సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించేందుకు బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలనే విషయంపై భారత్-చైనా మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. ఫింగర్ ఏరియా సహా ఇతర ఫ్రిక్షన్ పాయింట్ల నుంచి చైనా బలగాలను వెనక్కి మళ్లించాలనే విషయంపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. మరే ఇతర అంశాన్ని భేటీలో ప్రస్తావించడం లేదని స్పష్టం చేశాయి.
ఈ ప్రాంతాల నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్న తర్వాతే ఇతర విషయాలపై మరోసారి చర్చలు జరపాలని చైనాకు భారత్ తేల్చి చెప్పినట్లు సమాచారం.