చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇటీవలే పాకిస్థాన్లో పర్యటించారు. అనంతరం ఆ రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రస్తావనను తాము తిరస్కరిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే అని స్పష్టం చేశారు.
పాక్-చైనా సంయుక్త ప్రకటనలో కశ్మీర్ ప్రస్తావనేంటి? - CHINA
పాక్-చైనా దేశాలు తాజాగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో కశ్మీర్ అంశం ప్రస్తావించడాన్ని భారత్ తప్పుబట్టింది. జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది. పీఓకేలో పాక్-చైనా దేశాలు చేపడుతున్న ఆర్థిక కారిడార్ నిర్మాణంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్.
పాక్-చైనా సంయుక్త ప్రకటనలో కశ్మీర్ ప్రస్తావనేంటి?
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్-చైనా ఆర్థిక కారిడార్ నిర్మాణంపైనా రవీశ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
" పీఓకేలో చేపడుతున్న 'చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్'పై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. భారత్‌లో అంతర్భాగమైన ఈ ప్రాంతాన్ని 1947లో పాక్ ఆక్రమించుకుంది. రెండు సరిహద్దు దేశాలు అలాంటి చర్యలను తగ్గించుకోవాలి."
-రవీశ్ కుమార్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
Last Updated : Sep 30, 2019, 3:34 AM IST