తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిందూ యువతి మతం మార్చి పాక్​లో బలవంతపు పెళ్లి - national news latest

పాకిస్థాన్​లో ఓ హిందూ యువతిని కొంత మంది దుండగులు పెళ్లి పీటలపైనుంచి అపహరించి ఇస్లాంలోకి బలవంతంగా మతం మార్చారు. అంతటితో ఆగకుండా ముస్లిం యువకుడితో వివాహం జరిపించారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

India summons Pak High Commission official, issues demarche over Hindu girl's abduction in Sindh
పాకిస్థాన్​లో మతం మార్చి బలవంతపు పెళ్లి

By

Published : Jan 28, 2020, 7:54 PM IST

Updated : Feb 28, 2020, 7:49 AM IST

భారత్‌లో పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన వేళ పాకిస్థాన్‌లో ఓ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఓ హిందూ యువతిని పెళ్లి పీటలపై నుంచి అపహరించిన కొందరు దుండగులు ఇస్లాంలోకి బలవంతంగా మతం మార్పించి ముస్లిం యువకుడితో వివాహం జరిపించారు. ఆయుధాలు ధరించి వచ్చిన దుండగులు ఆ యువతిని బెదిరించి అపహరించారు.

భారత్​ తీవ్ర నిరసన...

సింధ్‌ రాష్ట్రం మతియారీ జిల్లాలో వారం క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై స్పందించిన పాకిస్థాన్​ మైనార్టీ వ్యవహారాల మంత్రి హరిరామ్‌ కిషోరీ... తనకు నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. భారత్‌ కూడా ఈ ఘటనపై స్పందించింది. దిల్లీలోని పాక్‌ రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారిని పిలిపించిన కేంద్రం.. తీవ్ర నిరసన తెలిపింది. ఈ ఘటనకు పాల్పడిన వారిని త్వరలోనే చట్టం ముందు నిలబెట్టాలని దాయాది దేశాన్ని డిమాండ్ చేసింది.

ఈ విషయంపై దర్యాప్తు చేయడం సహా తమ దేశ పౌరులకు పాక్‌ తగిన రక్షణ కల్పించాలని సూచించింది. ఈ నెల 26న పాక్‌లోని థర్పార్‌కర్‌లో ఉన్న మాతా రాణి భతియాని ఆలయాన్ని అపవిత్రం చేయడం పట్ల కూడా భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి : ప్రేమ పెళ్లి.. 10 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి

Last Updated : Feb 28, 2020, 7:49 AM IST

ABOUT THE AUTHOR

...view details