తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దులో దుశ్చర్యలపై పాక్​కు భారత్​ సమన్లు - పాక్​కు భారత్​ సమన్లు జారీ

పాకిస్థాన్​ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఘటనలను తీవ్రంగా తప్పుపట్టింది భారత్​. తాజాగా కృష్ణ ఘాటి సెక్టార్​లో పాక్​ సైన్యం కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దాయాది దేశ హై కమిషన్​కు సమన్లు జారీ చేసింది.

India summons Pak Charged Affaires
ముగ్గురు భారతీయుల హత్యపై పాక్​కు భారత్​ సమన్లు

By

Published : Jul 19, 2020, 8:53 AM IST

సరిహద్దుల్లో పాకిస్థాన్​ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దుశ్చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించింది భారత్​. శనివారం.. జమ్ముకశ్మీర్​లోని కృష్ణ ఘాటి సెక్టార్​లో పాక్​ సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మండిపడింది. ఈ ఘటనపై దాయాది దేశ హైకమిషనర్​కు సమన్లు జారీ చేసింది. పాక్​ దుర్నీతికి కృష్ణ ఘాటి సెక్టార్​లో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఓ చిన్నారి ఉంది.

దాయాది బలగాలు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకొని ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు పాకిస్థాన్​ హై కమిషన్​కు సమన్లు జారీ చేసినట్లు వెల్లడించింది. .

ఈ ఏడాదే 2711 సార్లు..

పాక్ ఇలా కాల్పుల విరమణను ఉల్లంఘించడం ఇదేం కొత్త కాదు. కేవలం ఈ ఏడాదే 2711 సార్లు ఒప్పందాన్ని అతిక్రమించగా.. 21 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 94 మంది గాయపడ్డారు.

ఇదీ చదవండి:పాక్​ దుర్నీతికి ముగ్గురు భారతీయులు బలి

ABOUT THE AUTHOR

...view details