తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శాంతి సూచి జాబితాలో భారత్@141

ప్రపంచ శాంతి సూచి జాబితాలో భారత్​ ర్యాంకు క్షీణించింది. ప్రపంచంలోని 163 దేశాల్లో 141వ స్థానంలో నిలిచింది​. గతేడాది 136వ ర్యాంకు సాధించిన భారత్​.. ఈ సారి 5 స్థానాలు పడిపోయింది.

శాంతి సూచి జాబితాలో క్షీణించిన భారత ర్యాంకు

By

Published : Jun 12, 2019, 9:30 PM IST

శాంతియుత దేశాల జాబితాలో భారత్​ ర్యాంకు గతేడాది కంటే 5 స్థానాలు దిగువకు పడిపోయింది. 2019 ప్రపంచ శాంతి సూచి జాబితాలోని 163 దేశాల్లో భారత్​ 141వ స్థానంలో నిలిచింది. గతేడాది 136వ ర్యాంకులో ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పీస్‌ ఈ ర్యాంకులను ప్రకటించింది.

సమాజ భద్రత, భద్రత స్థాయి, దేశీయ, అంతర్జాతీయ విభేదాలు, సైనికీకరణ వంటి పలు అంశాలను ప్రామాణికంగా తీసుకుంది.

ప్రపంచంలో అత్యంత శాంతికాముక దేశంగా ఉన్న ఐస్​లాండ్​ మరోసారి అగ్రస్థానం సంపాదించింది. 2008 నుంచి ఈ దేశానిదే తొలిస్థానం కావడం గమనార్హం. అఫ్గానిస్థాన్‌ చివరి స్థానంలో నిలిచింది.

ప్రపంచ శాంతి సూచి జాబితాలో న్యూజిలాండ్, ఆస్ట్రియా, పోర్చుగల్‌, డెన్మార్క్‌లు వరుసగా ఐస్​లాండ్​ తర్వాతి స్ధానాల్లో నిలిచాయి.

చివరి ఐదు దేశాల జాబితాలో అఫ్గానిస్థాన్​, సిరియా, దక్షిణ సూడాన్‌, యెమన్, ఇరాక్‌ ఉన్నాయి.

ఆ జాబితాలో ఏడో స్థానం..

వాతావరణ ముప్పు కలిగిన దేశాల జాబితాలో భారత్‌ 7వ స్థానంలో నిలిచింది. సైనిక అవసరాల కోసం అత్యధిక ఖర్చు చేస్తున్న అయిదు దేశాల జాబితాలో భారత్‌, అమెరికా, చైనా, సౌదీ అరేబియా, రష్యా నిలిచాయి.

ప్రపంచంలో గత ఐదేళ్లతో పోలిస్తే ప్రపంచ శాంతి మెరుగుపడిందని, దశాబ్దంతో పోలిస్తే ఇంకా మెరుగుపడాల్సి ఉందని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details