జమ్ముకశ్మీర్‌లోని పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం విడుదల చేసిన తాజా నివేదికపై నిరసన వ్యక్తం చేసింది భారత్. గతంలోని 'తప్పుడు, ప్రేరేపిత' ప్రచారానికి ఇది కొనసాగింపని పేర్కొంది. పాకిస్థాన్ నుంచి వచ్చే సరిహద్దు ఉగ్రవాద సమస్యను విస్మరించారని ఆరోపించింది.
గత ఏడాది ఐరాస మానవ హక్కుల హైకమిషనర్(ఓహెచ్సీహెచ్ఆర్) కార్యాలయం కశ్మీర్‌లోని పరిస్థితులపై మొదటిసారి నివేదిక రూపొందించింది. సోమవారం మరో నివేదికను విడుదల చేసింది. "కశ్మీర్లో అనేక ఆందోళనలు ఉద్భవిస్తున్నప్పటికీ సమస్య పరిష్కారానికి భారత్, పాకిస్థాన్ పటిష్ఠమైన చర్యలు తీసుకోవట్లేదు" అని నివేదికలో పేర్కొంది.
ఐరాస నివేదికను తప్పుపట్టారు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్‌కుమార్.