పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్థాన్లో సాధారణ ఎన్నికలు నిర్వహించాలన్న పాక్ నిర్ణయంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లోని భారతదేశ ప్రాంతాల్లో మార్పులు చేయడాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. పాకిస్థాన్ అక్రమంగా తమ స్వాధీనంలో ఉంచుకున్న ప్రాంతాలను ఖాళీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భారతదేశ ప్రాంతాలను ఆక్రమించుకోవడం లాంటి పనులను గిల్గిట్-బాల్టిస్థాన్లో ఎన్నికలు నిర్వహించడం వంటి పైపై చర్యలతో దాచి పెట్టాలని పాక్ భావిస్తోందని ఆరోపించారు.
ఆ ఎన్నికల నిర్వహణపై పాక్‌ను తప్పుబట్టిన భారత్
గిల్గిట్-బాల్టిస్థాన్లో సాధారణ ఎన్నికలు నిర్వహిస్తామని పాకిస్థాన్ ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది భారత్. పాక్ అక్రమంగా తమ స్వాధీనంలో ఉంచుకున్న ప్రాంతాలను ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లోని భారతదేశ ప్రాంతాల్లో మార్పులు చేయడాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది.
గిల్గిట్-బాల్టిస్థాన్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న పాక్‌పై భారత్ మండిపాటు
గిల్గిట్-బాల్టిస్థాన్లో సాధారణ ఎన్నికల నిర్వహణకు పాకిస్థాన్ ప్రభుత్వానికి ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతివ్వగా.. ఈ ఏడాది ఆగస్టు 18ను తేదీగా ఖరారు చేసింది.
Last Updated : Jul 3, 2020, 6:22 AM IST