పాకిస్థాన్లోని సిక్కుల పవిత్ర స్థలం గురుద్వారా నన్కానా సాహిబ్ వద్ద శుక్రవారం జరిగిన విధ్వంసకర చర్యల్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఖండించారు. ఈ దాడిపై భారత ప్రభుత్వం తక్షణమే పాక్ అధికారులతో చర్చించి... భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా యాత్రికులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని వెల్లడించారు.
దాడికి కారణమైన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు సోనియా. ఈ అంశం గురించి పాక్ అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని కేంద్రానికి సూచించారు.