తెలంగాణ

telangana

By

Published : Nov 6, 2020, 7:19 PM IST

ETV Bharat / bharat

'ఐదువారాలుగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికం'

భారత్​లో రికవరీల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత ఐదువారాల్లో కరోనా కేసుల కంటే కోలుకున్నవారే అధికంగా ఉన్నట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. అయితే మహారాష్ట్ర, కేరళ, దిల్లీ, బంగాల్​ రాష్ట్రాల్లో కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసింది.

India sees sudden spike in COVID cases
ఐదువారాలుగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికం

దేశవ్యాప్తంగా ఆరువారాల తర్వాత మళ్లీ కరోనా కేసులు ఎక్కువ నమోదవడంపై ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్​ హర్షవర్ధన్​. దేశంలో కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన ఆయన.. అందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు చేయాల్సిందేనని అధికారులకు సూచించారు​. ర్యాపిడ్ యాంటిజెన్​ టెస్ట్​లో నెగెటివ్​ వచ్చినవారికి ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, దిల్లీ, బంగాల్​లో​నే.. 50శాతం యాక్టివ్​ కేసులున్నాయని తెలిపింది ఆరోగ్య మంత్రిత్వశాఖ. మహారాష్ట్రలో 21.53శాతం, కేరళలో 16.12శాతం, దిల్లీలో 7.08శాతం, బంగాల్​లో 6.87శాతం క్రియాశీల​ కేసులున్నాయని మంత్రిత్వశాఖ గణాంకాలు విడుదల చేసింది.

రికవరీలే అధికం..

గురువారం ఒక్కరోజే 54,157 మంది కొవిడ్​ నుంచి కోలుకోగా... మొత్తం రికవరీల సంఖ్య 77 లక్షల 66 వేలకు చేరింది. గడిచిన ఐదు వారాలుగా కొత్త కేసుల సంఖ్య కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది.

ఈ గణాంకాలు గత ఆరువారాలుగా రోజువారి నమోదవుతున్న సగటు కేసుల సంఖ్యలో తగ్గుదలను సూచిస్తున్నాయి. ఆరు వారాల క్రితం రోజువారి సగటు కేసుల సంఖ్య 73,000 ఉండగా... ప్రస్తుతం ఆ సంఖ్య 46,000కు తగ్గింది. ఫలితంగా రివరీరేటు 92.32కు చేరింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6.19శాతం యాక్టివ్ ​కేసులున్నాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

ఇదీ చూడండి:బిహార్ బరి: తుది పోరుకు సర్వం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details