తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రశాంత్​కు సాయం కోసం పాక్​కు భారత్​ వినతి - పాక్ చెరలో ప్రశాంత్

ఇద్దరు భారతీయులను పాక్ అదుపులోకి తీసుకోవటంపై విదేశాంగ శాఖ స్పందించింది. ఇద్దరికీ దౌత్య సహాయం అందించి, ఎలాంటి హాని తలపెట్టకుండా భారత్​కు అప్పగించాలని కోరింది. పాక్​ కుట్ర సిద్ధాంతానికి వారిని బలి చేయవద్దని సూచించింది.

రవీశ్ కుమార్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

By

Published : Nov 21, 2019, 5:19 PM IST

పాకిస్థాన్​​ అదుపులోకి తీసుకున్న ఇద్దరు భారతీయులను స్వదేశానికి తిరిగిపంపాలని పొరుగు దేశాన్ని కోరింది భారత విదేశాంగ శాఖ. వారిద్దరికీ దౌత్య సాయం అందించాలని విజ్ఞప్తి చేసింది.

రవీశ్ కుమార్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

"ఇద్దరు భారతీయులు ప్రశాంత్ వెందమ్​, ధరిలాల్ పొరపాటున సరిహద్దు దాటి ఉంటారని భావిస్తున్నాం. వీరిద్దరిని అరెస్టు చేసినట్లు హఠాత్తుగా ప్రకటించటం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. వీరిని పాకిస్థాన్​ కుట్రకు బాధితులను చేయవద్దని కోరుతున్నాం. వీరిద్దరికీ దౌత్య సాయం అందించాలని పాక్​ను కోరాం. వారి భద్రతకు హామీ అడిగాం. ఎలాంటి హాని తలపెట్టకుండా త్వరగా భారత్​కు పంపాలని సూచించాం."

-రవీశ్ కుమార్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

పాకిస్థాన్​ అదుపులో ఉన్న ప్రశాంత్​ స్వస్థలం విశాఖ. ధరిలాల్​ది మధ్యప్రదేశ్​.

ABOUT THE AUTHOR

...view details