హవాలా మోసాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్‌మోదీ, ఆయన భార్య మినాల్‌కు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు అందజేయాలని భారత్.. స్విట్జర్లాండ్‌ను కోరింది. భారత్ విజ్ఞప్తి మేరకు స్విస్ పన్నుల విభాగం ఎఫ్‌టీఏ... లలిత్‌మోదీ దంపతులకు తాఖీదులు జారీ చేసింది. భారత్ విజ్ఞప్తిపై 10 రోజుల్లో సమాధానం చెప్పాలని లలిత్ మోదీ దంపతులను ఆదేశించింది.
అక్రమ నగదు లావాదేవీల విషయంలో సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని భారత్, స్విట్జర్లాండ్ ఓ ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. అందులో భాగంగానే స్విస్ తాజా చర్యలు తీసుకుంది.