ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరులో భారత్ విజయం సాధించింది. దేశంలో నమోదైన మొత్తం మూడు కేసుల(కేరళ)కు వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. వైరస్ సోకిన తొలి వ్యక్తిని తాజాగా త్రిస్సూర్ ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
వైద్య బోర్డు ఆధ్వర్యంలో ఆ వైద్య విద్యార్థిని ఆరోగ్య నివేదికలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాయి ఆసుపత్రి వర్గాలు. కరోనా సోకిన మరో ఇద్దరిని (అలప్పుజ, కాసర్గోడ్) ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.