జమ్ముకశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ మెందార్ సెక్టార్‌లోని బాలాకోట్ ప్రాంతంలో గ్రామాలపై ఆదివారం రాత్రి మోర్టార్లతో దాడి చేసింది.
పాక్ కవ్వింపు చర్యలకు భారత్ దీటైన జవాబు - కాల్పులవిరమణ ఒప్పందం ఉల్లంఘన
జమ్ము కశ్మీర్‌లోని సరిహద్దుల వెంబడి మరోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఫూంచ్ జిల్లా మెందార్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ సమీపంలోని గ్రామాలపై మోర్టార్లతో దాడి చేయగా భారత సైన్యం సమర్థంగా తిప్పి కొట్టింది.
![పాక్ కవ్వింపు చర్యలకు భారత్ దీటైన జవాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4454434-929-4454434-1568615290821.jpg)
మోర్టార్ షెల్లింగ్
పాక్ సైన్యం కవ్వింపు చర్యలను సమర్థంగా తిప్పికొట్టినట్లు భారత సైన్యాధికారులు తెలిపారు. ఈ ఘటనలో కొంతమంది జవాన్లకు గాయాలైనట్లు తెలిపిన అధికారులు... చికిత్స కోసం సైనిక ఆస్పత్రికి తరలించామన్నారు.
ఇదీ చూడండి: బాంబుదాడులు జరుపుతామని జైషే బెదిరింపు లేఖ!
Last Updated : Sep 30, 2019, 7:31 PM IST