దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కేసుల సంఖ్యతో పాటు మృతులు కూడా అంతకంతకూ పెరుగుతున్నారు. వైరస్ కారణంగా దేశంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా కొవిడ్-19 మృతుల 29కి చేరింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 942 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 99 మంది కోలుకున్నట్లు వెల్లడించింది.
బంగాల్, గుజరాత్లో ఇద్దరు మృతి
బంగాల్లో కరోనా వైరస్‌తో మరొకరు వృత్యువాతపడ్డారు. డార్జిలింగ్ జిల్లాలోని కలియంపోంగ్కు చెందిన 44 ఏళ్ల మహిళ.. ఉత్తర బంగాల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలు ఇటీవలే చెన్నై నుంచి తిరిగివచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం బంగాల్లో కొవిడ్-19 కేసుల సంఖ్య 21కి చేరింది. వీరిలో ఇద్దరు మృతి చెందారు.
గుజరాత్‌లోనూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాలు సంఖ్య 6కు చేరింది.
మహారాష్ట్రలో 215
దేశంలో అత్యధిక కేసులు నమోదైన మహారాష్ట్రలో తాజాగా మరో 12 కేసులు బయటపడ్డాయి. ఇందులో పుణె-5, ముంబయి-3, నాగ్‌పుర్-2, కొల్హాపుర్, నాశిక్ నుంచి ఒక్కో కేసు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 215కు చేరినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మధ్యప్రదేశ్‌లో 47