తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 24 గంటల్లో 10,956 కేసులు, 396 మరణాలు - హెల్త్​ మినిస్ట్రీ

భారత్​ కరోనా వైరస్​ ఉగ్రరూపం దాలుస్తోంది. కేసులు, మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. మరో 396 మంది ప్రాణాలు కోల్పోయారు.

India reports the highest single-day spike of 10,956 new #COVID19 cases & 396 deaths
భారత్​లో కరోనా వివరాలు

By

Published : Jun 12, 2020, 9:41 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల జాబితాలో భారత్​ నాలుగో స్థానానికి చేరింది. 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 10 వేల 956 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 396 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు కేసులు, మరణాల్లో ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

దేశంలో కరోనా వివరాలు

మహారాష్ట్రలో అత్యధికంగా 3590 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 97 వేలు దాటింది. గుజరాత్​లో 1385 మంది, మధ్యప్రదేశ్​లో 431, బంగాల్​లో 442 మంది మరణించారు.

ABOUT THE AUTHOR

...view details