దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. కొత్తగా 73,272 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 926మంది మరణించారు.
కేంద్ర వైద్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 69,79,424కు చేరింది. మరణాల సంఖ్య 1,07,416కు పెరిగింది. కరోనా నుంచి 59,88,823 మంది బాధితులు కోలుకున్నారు.