దేశంలో కొత్తగా 67,708 కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య శాఖ బులిటెన్ ప్రకారం మొత్తం కేసులు 73లక్షల 7వేల 98కి చేరాయి.
దేశవ్యాప్తంగా 73 లక్షలకు చేరిన కరోనా కేసులు
భారత్లో మరో 67 వేల కరోనా కేసులు వెలుగుచూశాయి. 608 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 73 లక్షలకు చేరగా.. మరణాల సంఖ్య 1లక్ష 11వేల 266గా ఉంది. బుధవారం ఒక్కరోజే 11 లక్షలకు పైగా కరోనా నిర్ధరణ పరీక్షలు జరిగాయి.
కరోనా
మరో 680 మంది కరోనా తీవ్రతకు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 1లక్ష 11వేల 266కి చేరింది. 8లక్షల 12వేల 390మంది కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 63లక్షల 83వేల 442కు పెరిగింది.
- రికవరీ రేటు: 87.36%
- మరణాల రేటు: 1.52%
దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 11లక్షల 36వేల 183 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఫలితంగా దేశంలో కరోనా పరీక్షల సంఖ్య 9.12కోట్లకు చేరింది.
Last Updated : Oct 15, 2020, 10:10 AM IST