దేశంలో కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది. కొత్తగా 8,635 కేసులు వెలుగులోకి వచ్చాయి. అదేసమయంలో వైరస్ బారినపడి 94 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 1,07,66,245
- యాక్టివ్ కేసులు: 1,63,353
- కోలుకున్నవారు: 1,04,48,406
- మొత్తం మరణాలు: 1,54,486
కరోనా సోకిన వారిలో మరో 13,423 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రికవరీ రేటు 97.05 శాతానికి పెరిగింది. మరణాల రేటు స్థిరంగా 1.43 శాతానికి తగ్గింది.