తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో 75కు చేరిన కరోనా కేసులు - india corona cases

భారత్​లో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 75 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటకలో ఓ వ్యక్తి వైరస్​ సోకి మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.

India reports 75 coronavirus cases: Health ministry
భారత్​లో 75కు చేరిన కరోనా కేసులు

By

Published : Mar 13, 2020, 1:56 PM IST

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తూ ఇప్పుడు భారత్​నూ కలవరపెడుతోంది. ఇప్పటివరకు దేశంలో 75 మందికి కరోనా సోకగా, కర్ణాటకలో ఓ వ్యక్తి మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్​ సోకిన వారిలో 17మంది విదేశీయులున్నారు. వారిలో 16మంది ఇటలీ పర్యటకులు, ఒకరు కెనాడాకు చెందినవారు.

కరోనాతో మృతి చెందిన వ్యక్తిని కలబురిగి వాసిగా గుర్తించారు అధికారులు. అతను సౌదీ అరేబియా నుంచి ఇటీవలే తిరిగివచ్చినట్లు వివరించారు.

దేశవ్యాప్తంగా..

దేశ రాజధాని దిల్లీలో 6 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 11 మంది వైరస్​ బారిన పడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లో 10 మందికి, కర్ణాటకలో ఐదుగురికి ఈ మహమ్మారి సోకింది. అత్యధికంగా కేరళలో 17 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది.

వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వైరస్​ సోకిన 75 మంది సుమారు 1500 మందిని కలిసినట్లు అధికారులు పేర్కొన్నారు. వారందరినీ వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు స్పష్టం చేశారు.

ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు..

రాష్ట్రం భారతీయులు విదేశీయులు నయమైనవి మరణాలు
దిల్లీ 6 0 0 0
హరియాణా 0 14 0 0
కేరళ 17 0 3 0
రాజస్థాన్​ 1 2 0 0
తెలంగాణ 1 0 0 0
ఉత్తర్​ప్రదేశ్​ 10 1 0 0
లద్దాక్​( కేంద్ర పాలిత ప్రాంతం) 3 0 0 0
తమిళనాడు 1 0 0 0
జమ్ముకశ్మీర్​( కేంద్ర పాలిత ప్రాంతం) 1 0 0 0
పంజాబ్​ 1 0 0 0
కర్ణాటక 5 0 0 1
మహారాష్ట్ర 11 0 0 0
ఆంధ్రప్రదేశ్​ 1 0 0 0
మొత్తం కేసులు 58 17 3 1

ABOUT THE AUTHOR

...view details