తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 18,222 కేసులు-228 మరణాలు - covid19india

దేశవ్యాప్తంగా కొత్తగా 18,222 మంది కరోనా బారిన పడ్డారు. మరో 228 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 19వేల మందికిపైగా మహమ్మారిని జయించగా.. రికవరీ రేటు 96.39శాతానికి చేరింది.

India reports 18,222 new COVID-19 cases, 19,253 discharges, and 228 deaths in last 24 hours, as per Union Health Ministry
మరోసారి 19వేల దిగువకు కరోనా కేసులు

By

Published : Jan 9, 2021, 10:13 AM IST

దేశంలో కరోనా కేసులు ఇరవై వేల దిగువకు నమోదైయ్యాయి. తాజాగా 18,222 మందికి కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 1 కోటి 4లక్షల 31వేల 639కు పెరిగింది. వైరస్​ ధాటికి మరో 228 మంది బలవ్వగా.. మృతుల సంఖ్య 1లక్షా 50వేల 798కి చేరింది.

రికవరీ రేటు ఇలా..

తాజాగా 19వేల మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు. ఫలితంగా కరోనాను జయించిన వారి సంఖ్య 1కోటి 56వేల 651కి చేరింది. 2లక్షల 24వేల 190యాక్టివ్​ కేసులున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 96.39 శాతానికి ఎగబాకింది. మరణాల రేటు స్థిరంగా 1.45 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇదీ చూడండి: దేశంలో 82కు చేరిన కొత్త కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details