దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా 16,432 కేసులు వెలుగుచూశాయి. బాధితుల సంఖ్య 1కోటి 2లక్షల 24వేల 303కి చేరింది. మరో 252 మంది మహమ్మారికి బలవ్వగా.. మరణాల సంఖ్య లక్షా 48వేల 153కు పెరిగింది.
రికవరీ రేటు ఇలా..
తాజాగా సుమారు 21వేల మంది వైరస్ను జయించగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98లక్షల 7వేల 569కి పెరిగింది. 2లక్షల 68వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 95.83 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.45 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.