దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సోమవారం కనిష్ఠంగా 10,064 కేసులు నమోదయ్యాయి. మరో 137 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 17,411 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 1,05,81,837
- క్రియాశీల కేసులు: 2,00,528
- కోలుకున్నవారు: 1,02,28,753
- మరణాలు: 1,52,556