దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 15వేలలోపే కొత్త కేసులు నమోదవుతుండటం ఊరట కలిగించే విషయం. దేశవ్యాప్తంగా కొత్తగా 13,788 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. 14,457 మంది వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు: 1,05,71,773
- క్రియాశీల కేసులు: 2,08,012
- కోలుకున్నవారు: 1,02,11,342
- మరణాలు: 1,52,419