తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణలో కీలకంగా భారత్'

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో భారత్​ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే సానుకూల స్పందనలు చూస్తున్నట్టు స్పష్టం చేశారు. బ్రిటన్​ వేదికగా నిర్వహిస్తున్న 'ఇండియా గ్లోబల్​ వీక్​​-2020'లో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

India remains one of the most open economies in the world: pm modi
'ప్రపంచ పునరుద్ధరణలో భారత్​దే కీలక పాత్ర'

By

Published : Jul 9, 2020, 2:08 PM IST

Updated : Jul 9, 2020, 2:38 PM IST

భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సానుకూలంగా సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆర్థిక వ్యవస్థ అందరికీ అందుబాటులో ఉండే అతి తక్కువ దేశాల్లో భారత్​ ఒకటని వెల్లడించారు.

బ్రిటన్​లో నిర్వహిస్తున్న 'ఇండియా గ్లోబల్​ వీక్​-2020'లో దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు మోదీ. ప్రపంచ దేశాల్లోని దిగ్గజ సంస్థలు భారత్​లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఆహ్వానించారు.

"అసాధ్యాలను సుసాధ్యం చేయడానికి భారతీయులు కృషిచేస్తారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపరంగా ఇప్పటికే సానుకూలత చూస్తున్నాం. ప్రపంచస్థాయి కంపెనీలను మేము భారత్​కు ఆహ్వానిస్తున్నాం. ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ దేశాలు కల్పిస్తాయి."

-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

భారత్​లోని వివిధ రంగాల్లో పెట్టుబడులకు మెరుగైన అవకాశాలున్నాయని మోదీ పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో భారత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు.. పెట్టుబడులు పెట్టే వారిని ఆకర్షిస్తాయని వెల్లడించారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి సాగుతున్న పోరాటంలో భారత దేశం కీలక పాత్ర పోషిస్తుందన్నారు ప్రధాని. భారత్​కు ఉన్న శక్తిని ప్రపంచ దేశాలు ఇప్పటికే చూశాయని.. ప్రపంచాభివృద్ధి కోసం తమ వంతు కృషి చేయడానికి భారతీయులు ఊవిళ్లూరుతున్నారని వ్యాఖ్యానించారు.

వ్యాక్సిన్​ కోసం..

ప్రపంచవ్యాప్తంగా చిన్నారులకు అందుతున్న మూడింట రెండొంతుల వ్యాక్సిన్​లు భారత్​కు చెందినవేనని మోదీ పేర్కొన్నారు. కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ రూపొందించడం, ఆ తర్వాత దాన్ని ఉత్పత్తి చేయడంలోనూ భారత్​ కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం భారత కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయన్నారు.

ఇదీ చూడండి:-సరిహద్దుల్లో కీలక వంతెనలను ప్రారంభించిన రాజ్​నాథ్​

Last Updated : Jul 9, 2020, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details