తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కార్గిల్​ వీరుల శౌర్యం భావితరాలకు స్ఫూర్తిదాయకం' - Modi news

కార్గిల్​ విజయ్​ దివస్​ సందర్భంగా 1999లో పాకిస్థాన్​పై వీరోచితంగా పోరాటం చేసిన భారత జవాన్ల ధైర్యసాహసాలను గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సైనికుల శౌర్యం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

Modi
కార్గిల్​ వీరల శౌర్యం భావితరాలకు స్ఫూర్తిదాయం: మోదీ

By

Published : Jul 26, 2020, 10:58 AM IST

Updated : Jul 26, 2020, 11:19 AM IST

పాకిస్థాన్​పై అపూర్వ విజయానికి నేటికి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. వీర జవాన్ల ధైర్య సాహసాలను గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆనాటి జవాన్ల శౌర్యం, వీరోచిత పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డారు.

" కార్గిల్​ విజయ్​ దివస్​ సందర్భంగా 1999లో మన దేశాన్ని రక్షించిన మన సాయుధ దళాల ధైర్యం, ధృడ సంకల్పం గుర్తు చేసుకోవాలి. వారి శౌర్యం, పరాక్రమం భావితరాలకు స్ఫూర్తిదాయకం. జవాన్ల ధైర్యసాహసాలకు భారత్​ కృతజ్ఞతలు తెలుపుతోంది"

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఇదీ చూడండి: 'జవాన్ల శౌర్య, పరాక్రమాలతోనే కార్గిల్ విజయం'

Last Updated : Jul 26, 2020, 11:19 AM IST

ABOUT THE AUTHOR

...view details