తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రామాలయంపై పాక్​ విమర్శలను తిప్పికొట్టిన భారత్​ - Anurag Srivastava news

రామ మందిర నిర్మాణంపై పాకిస్థాన్​ విమర్శలను భారత్​ తిప్పికొట్టింది. మత విద్వేషాలు సృష్టించే ప్రయత్నాలను​ ఆపాలని సూచించింది. పాక్​ పత్రికా ప్రకటన ఊహించినదేనని, ముందు దేశంలోని మైనారిటీల హక్కులను పరిరక్షించాలని చురకలు అంటించింది.

Pakistan's criticism of launch of construction of Ram temple
రామ మందిర్​పై పాక్​ విమర్శలను తిప్పికొట్టిన భారత్​

By

Published : Aug 6, 2020, 4:33 PM IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం భూమిపూజ చేయటంపై పాకిస్థాన్​ చేసిన విమర్శలను తిప్పికొట్టింది భారత్​. మత విద్వేషాలు సృష్టించే ప్రయత్నాలను మానుకోవాలని హెచ్చరించింది.

భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని పాక్​కు హితవు పలికారు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ.

" భారత అంతర్గత వ్యవహారాల్లో ఇస్లామిక్​ రిపబ్లిక్​ ఆఫ్​ పాకిస్థాన్​ మీడియా ప్రకటనను చూశాం. భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. అలాగే మతపరమైన విద్వేషాలు రాజేయడం మానుకోవాలి. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, సొంత దేశంలో మైనారిటీల హక్కులను కాలరాసే దేశం నుంచి ఇది ఆశ్చర్యకరమైన వైఖరేంకాదు. కానీ, ఇటువంటి వ్యాఖ్యలు తీవ్ర విచారం కలిగిస్తాయి.

- అనురాగ్​ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ ప్రతినిధి.

ఇదీ చూడండి: సరిహద్దులో చైనా దురాక్రమణ నిజమే: రక్షణశాఖ

ABOUT THE AUTHOR

...view details