పాకిస్థాన్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కుతూ... పౌరసత్వ చట్ట సవరణపై తన పార్లమెంటులో తీర్మానం చేయడాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఆ దేశంలోని మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే పౌరసత్వ సవరణపై పాక్ తీర్మానం చేసిందని వ్యాఖ్యానించింది.
జమ్ముకశ్మీర్, లద్దాఖ్లపై పాకిస్థాన్‌కు ఉన్న దురుద్దేశాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ తీర్మానం ద్వారా ప్రయత్నించిందని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
"సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్.. తన చర్యలకు మద్దతును అందించేందుకు ఈ రకమైన ప్రయత్నాలు చేస్తోంది. మాకు నమ్మకం ఉంది. ఇలాంటి ప్రయత్నాలు విఫలమవుతాయి."