తెలంగాణ

telangana

బాబ్రీ తీర్పుపై పాక్​ విమర్శలకు భారత్​ గట్టిజవాబు

By

Published : Oct 2, 2020, 6:04 AM IST

బాబ్రీ మసీదు కేసు తీర్పు విషయంలో పాకిస్థాన్​ చేసిన విమర్శలను తిప్పికొట్టింది భారత్​. ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకునే శక్తి దాయాది దేశానికి లేదని స్పష్టం చేసింది. ఇటీవల సీబీఐ ప్రత్యేక కోర్టు వెల్లడించిన తీర్పును పాక్​ తప్పుబట్టిన నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇలా స్పందించింది.

India rejects Pak criticism of court ruling in Babri Masjid case
బాబ్రీ తీర్పుపై పాక్​ విమర్శలకు భారత్​ గట్టిజవాబు

బాబ్రీ తీర్పు విషయంలో పాకిస్థాన్‌ చేసిన విమర్శలను భారత్‌ దీటు జవాబిచ్చింది. ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకునే శక్తి పాక్‌కు లేదని స్పష్టం చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ నిర్దోషులుగా ప్రకటించడాన్ని పాక్​ విదేశాంగ కార్యాలయం తప్పుబట్టింది. మైనారిటీలకు ముఖ్యంగా ముస్లింలకు రక్షణ కల్పించాలని వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి: బాబ్రీ కేసు తీర్పును ఖండించిన పాక్​

ఈ నేపథ్యంలో పాక్​ వ్యాఖ్యలను ఖండించారు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాత్సవ. భారత్​ పరిపక్వత గల ప్రజాస్వామిక దేశమని.. కోర్టు తీర్పుల పట్ల ప్రభుత్వం, ప్రజలు విధేయత చూపిస్తారని స్పష్టం చేశారు. అయితే అధికార వ్యవస్థను ఇష్టానుసారం వినియోగించి.. ప్రజలను, కోర్టులను నోరు మెదపకుండా చేసే నిర్భంద వ్యవస్థకు ఈ ప్రజాస్వామ్య విలువలు అర్థం కావని ఆయన విమర్శించారు.

గతంలోనూ అనేక మార్లు భారత అంతర్గత విషయాల్లో పాకిస్థాన్​ జోక్యం చేసుకుంది. ఆయా సందర్భాల్లో దాయాది​పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది భారత్​.

బాబ్రీ కేసులో 28ఏళ్ల పాటు సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. సెప్టెంబర్​ 30న తీర్పును వెలువరించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషి సహా 32మందిని నిర్దోషులుగా తేల్చింది.

ABOUT THE AUTHOR

...view details