తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ వాస్తవాధీన రేఖపై చైనా ఇటీవల లేవనెత్తిన కొత్త వాదన పట్ల భారత్ తీవ్రంగా మండిపడింది. వాస్తవాధీన రేఖ విషయంలో 1959లో చైనా ప్రధాని చౌ ఎన్‌లై, అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు రాసిన లేఖలోని అంశాలకే తాము కట్టుబడి ఉన్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి చేసిన ప్రకటనను భారత్ తప్పుబట్టింది.
'ఆ వాదనను భారత్ ఎప్పుడూ అంగీకరించలేదు' - lac perception india china letter
వాస్తవాధీన రేఖ విషయంలో భారత మాజీ ప్రధాని నెహ్రూకు, చైనా మాజీ ప్రధాని చౌ ఎన్‌లై రాసిన లేఖలోని అంశాలకే కట్టుబడి ఉన్నామన్న ఆ దేశ వాదనను విదేశాంగ శాఖ తప్పుబట్టింది. ఇది అవాస్తవాలతో కూడిన ఏకపక్ష వాదన అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ వాదనను భారత్ ఎప్పుడూ అంగీకరించలేదని తేల్చిచెప్పారు.
ఇది అవాస్తవాలతో కూడిన ఏకపక్ష వాదన అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ వాదనను భారత్ ఎప్పుడూ అంగీకరించలేదని ఆయన స్పష్టం చేశారు. భారత్ అనుసరిస్తున్న ఈ వైఖరి స్థిరమైనది, అది అందరికీ తెలిసినదేనని పేర్కొన్నారు.
వాస్తవాధీన రేఖ స్వరూపం, సరిహద్దులో శాంతి కొనసాగింపుపై కుదిరిన వివిధ ఒప్పందాలను అనురాగ్ శ్రీవాస్తవ ఉదహరించారు. ఈ విషయాలపై రెండు దేశాలు ఉమ్మడి అభిప్రాయానికి వచ్చాయని గుర్తు చేశారు. ఎల్ఏసీపై యథాతథ స్థితిని చైనా ఏకపక్షంగా మార్చే ప్రయత్నం చేసిందని ఆయన అన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని ఒప్పందాలకు కట్టుబడి ఉన్నామని ఈ నెల 10న రెండు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో చైనా చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.