ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. మోదీ విధానాలతో దేశం ఇబ్బందులు పడుతోందని రాహుల్ అన్నారు. ప్రధాని నిస్సత్తువ కారణంగా సరిహద్దుల్లో చైనా బలగాలు దురాక్రమణకు తెగబడుతున్నాయని ఆరోపించారు.
చైనా దురాక్రమణకు మోదీ అలసత్వమే కారణం-రాహుల్ - రాహుల్ గాంధీ మోదీపై విమర్శలు
ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. మోదీ పాలనలో దేశం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోందన్నారు. ప్రధాని అలసత్వం కారణంగానే సరిహద్దుల్లో చైనా బలగాలు దురాక్రమణకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు.
దేశంలో కరోనా కట్టడి సహా.. రోజురోజుకు దిగజారిపోతున్న ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టడంలోనూ ప్రధాని విఫలమయ్యారని వ్యాఖ్యానించారు రాహుల్. మోదీ పాలనలో చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా జీడీపీ 23.9 శాతం మేర పడిపోయందన్నారు. దేశంలో నిరుద్యోగిత 45 ఏళ్ల రికార్డుకు చేరడం సహా.. 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని రాహుల్ పేర్కొన్నారు. రాష్ట్రాలకు జీఎస్‌టీ కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రోజువారీ కరోనా కేసుల్లో భారత్.. ప్రపంచ దేశాలను మించిపోయిందని, సరిహద్దుల్లో విదేశీ దురాక్రమణలు పెచ్చుమీరాయంటూ ట్వీట్ చేశారు రాహుల్.
ఇదీ చదవండి:యుద్ధమేఘాలు- నివురుగప్పిన నిప్పులా నిర్మల హిమగిరులు