దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం కొత్తగా 179 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్కరోజు నమోదైన కేసులలో ఇదే అత్యధికం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 918కి చేరింది. ఇందులో 47 మంది విదేశీయులు ఉన్నట్లు స్పష్టం చేసింది కేంద్రం.
దేశంలో కరోనా ధాటికి 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 5, గుజరాత్లో 3, కర్ణాటకలో 2, మధ్యప్రదేశ్లో 2, తమిళనాడు, బిహార్, పంజాబ్, దిల్లీ, పశ్చిమ బంగాల్, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.